Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ సినిమా వల్ల నన్ను ముసలాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు.. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగానే!
కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుంటోంది. చాలా మంది హీరోయిన్లు గ్లామర్ పరంగా పాపులర్ అవుతుంటారు. కానీ కీర్తి సురేష్ అలా కాదు. తొలి చిత్రంతోనే క్యూట్ లుక్స్ తో అదరగొట్టిన ఈ యంగ్ బ్యూటీ ఆ తరువాత నటనతో కూడా మెప్పించింది. మహానటి చిత్రం తరువాత తనకు ఎలాంటి క్రేజ్ లభించిందో వివరిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
వరుస హిట్లు
కీర్తి సురేష్ తెలుగులో నటించిన తొలి చిత్రం నేను శైలజ. తొలి చిత్రంతోనే తెలుగువారిని కీర్తి మాయ చేసింది. ఆ తరువాత నేను లోకల్ చిత్రం కూడా విజయం సాధించడంతో కీర్తి సురేష్ పేరు మారుమోగింది. తమిళంలో కూడా మంచి అవకాశాలని అందుకుంది.
మహానటిగా
ఈ దశలో సావిత్రి బయోపిక్ చిత్రం మహానటిలో నటించే అద్భుత అవకాశాన్ని అందుకున్న కీర్తి సురేష్ నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. సావిత్రిలాగా నటించడం అంత సులువైన విషయం కాదు. కానీ కీర్తి సురేష్ హావభావాలతో సహా అచుగుద్దినట్లు సావిత్రిలా నటించింది. మహానటి చిత్రం ఈ ఏడాది విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
ముసలాళ్ళు కూడా
మహానటి చిత్రంతో తనకు వచ్చిన క్రేజ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ వివరించింది. మహానటి చిత్రం తరువాత తాను ఎక్కడ కనిపించినా వృద్దులు కూడా ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఇటీవల ఓ విమానాశ్రయంలో నేను కనిపించగానే చాలామంది మహిళలు, వృద్దులు తన కోసం ఎగబడ్డారని కీర్తి వివరించింది.
సర్కార్‌తో మరో బ్లాక్ బస్టర్
విజయ్ నటించిన సంచలన చిత్రం సర్కార్ లో కీర్తి సురేష్ హీరోయిన్. సర్కార్ చిత్రంతో కీర్తి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాదిలో పలు ఆసక్తికరమైన చిత్రాల్లో కీర్తి సురేష్ నటిస్తోంది.