లిప్‌లాక్‌, బికినీ అంటే భయం కాదు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్

టాలీవుడ్ మహనటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటి కీర్తి సురేష్. కోలీవుడ్ లో కూడా స్టార్ యాక్టర్స్ తో నటిస్తూ తన క్రేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఈ బ్యూటీపై అనేక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. బికినీ, లిప్ లాక్ ఉన్న సన్నివేశాల్ని రిజెక్ట్ చేసిందని టాక్ వచ్చింది. వాటిపై కీర్తి వివరణ కూడా ఇచ్చింది. అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ఒక కారణం ఉందని ఈ బ్యూటీ ఇటీవల క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గ్లామర్ గీత దాటకుండా..

గ్లామర్ గీత దాటకుండా..

పెద్దగా గ్లామర్ ప్రజెంటేషన్ లేకపోయినా కూడా కీర్తి పెద్ద సినిమాల్లో ఈజీగా అవకాశాలు అందుకుంటోంది. హాట్ రోల్స్ ఎన్ని వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తోంది. గ్లామర్ గీత దాటకుండా ఒక పరిధిలోనే నటిస్తూ కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలని ఎంచుకుంటోంది. ఇటీవల ఈ క్యూట్ గర్ల్ తనపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చింది.

రిజెక్ట్ చేసిందట..

రిజెక్ట్ చేసిందట..

త్వరలోనే కీర్తి సురేష్ బికినిలో కనిపించనుందని కొన్ని రూమర్స్ రాగా అవన్నీ అబద్ధాలు అని అమ్మడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాగే నితిన్ అందాదున్ రీమేక్ లో ఒక లిప్ లాక్ ఉందని ఏకంగా ఆ సినిమానే వదులుకుంది. ఎప్పటికప్పుడు తనపై వస్తున్న రూమర్స్ పై ఈ బ్యూటీ క్లారిటీ ఇస్తూ వస్తోంది.

కారణం ఉంది..

కారణం ఉంది..

అలాంటి ఆఫర్స్ ని రిజెక్ట్ చేయడానికి కీర్తి దగ్గర ఒక బలమైన కారణం ఉందట. భయంతో కాదంటూ.. ఎక్కడైనా సరే మన ఆలోచనలను బట్టి మనసు చెప్పింది వినాలి అని ఓ విదంగా అలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని అంటోందట. అదే విధంగా ఆడియెన్స్ ని దృష్టిలో ఉంచుకొని కూడా నడుచుకోవాలని చెబుతోంది.

Recommended Video

Rana Daggubati And Venkatesh To Act In An Multistarer!
ఫైనల్ క్లారిటీ..

ఫైనల్ క్లారిటీ..

మహానటి సినిమా తరువాత ఆడియెన్స్ నన్ను ఒక హీరోయిన్ లా కాకుండా ఒక మంచి నటిగా ఇష్టపడుతున్నారు. నేను ఎంచుకుంటున్న పాత్రలు నాకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. నేను హాట్ రోల్స్ చేసినా, లిప్ లాక్, బికినీ వంటి సీన్స్ లో కనిపించినా ఆడియెన్స్ కి ఎంత మాత్రం నచ్చదని అనుకుంటున్నా.. మెయిన్ గా నాకు కూడా అలాంటి ఆఫర్స్ కి ఒప్పుకోవడం ఇష్టం ఉండదని కీర్తి క్లారిటీగా చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X