గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహానటి.. మొక్కలు నాటిన కీర్తి సురేష్
గ్రీన్ఇండియా ఛాలెంజ్ టాలీవుడ్‌లో బాగానే పాపులర్ అవుతోంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే సినీ తారలెందరో ఒకరినొకరు సవాళ్ విసురుతూ మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తాజాగా మహానటి కీర్తి సురేష్ వంతు వచ్చింది.
సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో కీర్తి సురేష్ మొక్కలు నాటింది. అనంతరం మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. అందరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

ఈ గ్రీన్ ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించారని తెలిపింది. కాలుష్యం పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని చెట్లను పెంచాలని కోరింది. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











