ప్రియుడుతో కలిసి జంప్ ... కీర్తి సురేష్ ఇంత పనిచేసిందా?
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ నటీనటులు అంతా కొత్త సినిమాల విడుదలలు ఏమో కానీ పెళ్లి, ప్రేమల వ్యవహారాలతో మాత్రం మంచి బిజీగా కనిపిస్తున్నారని చెప్పాలి. లేటెస్ట్ గా మన తెలుగు సినీ తారల విషయానికే వస్తే యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళని వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు.
మన తెలుగు నుంచి ఈ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోయిన్, మన తెలుగు వాళ్లకి బాగా సుపరిచితురాలైన నటి కీర్తి సురేష్‌పై కూడా పలు వార్తలు మొదలయ్యాయి. ఈ ఏడాదిలోనే తనపై వచ్చిన రూమర్స్ ని ముందు ఖండించిన కీర్తి సురేష్ తర్వాత మౌనం గానే ఉండడం అనేది ఆమె అంగీకారాన్ని చూపించింది.

కాగా కీర్తి పెళ్లి తన ప్రియుడినే చేసుకుంటుంది అని ఈ వార్తలు వస్తే ముందు కీర్తి సురేష్ ఒకొక్కటిగా అఫీషియల్ క్లారిటీ ఇస్తూ వచ్చింది. తొలుత ఏకంగా 15 ఏళ్ళు తాను ప్రేమలో ఉన్నట్టుగా తన లవర్ ఆంటోనీతో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసుకొని అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో తన పెళ్లిపై తొలిసారి కామెంట్ చేసింది. తన వివాహం ఈ డిసెంబర్ లోనే ఉంటుందని, గోవాలో చేసుకుంటున్నాను అంటూ అసలు మేటర్ రివీల్ చేసింది.
కాగా డేట్ ఎప్పుడు అనేది ఇంకా అఫీషియల్‌గా చెప్పలేదు కానీ రూమర్స్ మాత్రం డిసెంబర్ 11, 12 తేదీల్లో చేసుకుంటుంది అని చెబుతున్నాయి. మరి ముందు వచ్చిన అన్నీ నిజం అయినపుడు ఇది కూడా నిజం కావచ్చని చెప్పొచ్చు. కానీ ఇంకా అందుకు సమయం ఉన్నప్పటికీ కీర్తి సురేష్ తన ప్రియుడితో కలిసి ఓ వారం ముందే గోవాకి జంప్ అయ్యిపోయింది.

డిసెంబర్ 5 అర్థరాత్రి గోవాకి పయనం అయ్యినట్టుగా టికెట్స్ కూడా పోస్ట్ చేసింది. దీనితో ఇంకా వారం సమయం ఉన్నప్పటికీ కీర్తి సురేష్ ఇంత ఫాస్ట్ గా ఉందేంటి అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి వెడ్డింగ్ ప్లానింగ్ వారికి ముందే చెబితే అన్నీ సెట్ చేసి వారే ఉంచుతారు. అయినప్పటికీ ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయింది అనే కామెంట్స్ కూడా ఇపుడు వినిపిస్తున్నాయి.
ఇలా మొత్తానికి కీర్తి సురేష్ పెళ్ళికి ముందే మామూలు ఫాస్ట్ అండ్ ప్లానింగ్ లో లేదని చెప్పాలి. ఓ పక్క పెళ్లి పనులు చూసుకుంటూనే, ఇంకోపక్క తన హిందీ డెబ్యూ చిత్రం "బేబీ జాన్" ప్రమోషన్స్ లోనూ కీర్తి సురేష్ చురుగ్గా పాల్గొంటోంది. కాగా ఈ భారీ చిత్రం ఈ డిసెంబర్ లోనే క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుండగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేష్ నటించింది.


Click it and Unblock the Notifications











