గోవాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రేమ పెళ్లి..నెట్టింట్లో ఫోటోలు వైరల్..
Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బజాలు మోగుతున్నాయి. నటులు, నటీమణులు, మూవీ మేకర్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ అవుతున్నారు. తమకు నచ్చిన వారితో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఇక టాలీవుడ్ హీరో నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల డిసెంబర్ 4న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి.. మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..?
అమ్మడు ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. మహానటి కీర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మలయాళ ము్ద్దుగుమ్మ తెలుగులో వరుస విజయాలు అందుకుంది. తన అందం, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో మెప్పించి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది. తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా వరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ కు దూరమైన.. బాలీవుడ్,కోలీవుడ్ లో మాత్రం దూసుకెళ్తుంది.

హీరోయిన్ కీర్తి సురేశ్, తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీతో మూడు ముళ్లు వేసుకుని ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు.వీరి వివాహా వేడుక గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మధ్య వీరి వివాహా వేడుక జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను హీరోయిన్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. #fortheloveofnyke అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో నూతన వధువరులకు అభిమానులు అభినందనలు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
కీర్తి సురేశ్, ఆంటోనీ లు దాదాపు 15 ఏండ్లుగా స్నేహితులు. కాలేజ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని కీర్తి అధికారికంగా ప్రకటించింది. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందంటూ ఇంట్రెస్ట్ పోస్ట్ పెట్టింది. ఇక ఆంటోనీ విషయానికి వస్తే.. వారిది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వారికి బిజినెస్ లు ఉన్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం . కాలేజీ రోజుల్లో వీరి స్నేహం ప్రేమగా మారిందని టాక్.

ఇదిలా ఉంటే.. కీర్తి ఇటీవల 'రఘుతాత'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్ రీటా', 'బేబీ జాన్' సినిమా షూటింగ్స్ లతో బిజీగా ఉన్నారు. 'బేబీ జాన్'తో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కాబోతుంది. ఏదిఏమైనా మొత్తానికి నటి కీర్తిసురేశ్ కుడా ఓ ఇల్లాలు గా మారింది.


Click it and Unblock the Notifications











