For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీరో సైజుకు గుడ్ బై చెప్పనుంది.. మళ్లీ పాత లుక్కులోని మారనున్న కీర్తి సురేష్!!

    |

    కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా నేడు (నవంబర్ 4) విడుదలైంది. ఇది పెంగ్విన్ మాదిరిగానే నిరాశను కలిగించింది. ఇవన్నీ ఓటీటీలోనే విడుదలవ్వడంతో కీర్తి సురేష్ బతికిపోతోంది. ఇవే గనుక సిల్వర్ స్క్రీన్‌పై వచ్చి ఉంటే కీర్తి సురేష్ ఇమేజ్ ఘోరంగా దెబ్బతినేది. ఓటీటీలోనే కాబట్టి అంతగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే మిస్ ఇండియా ఫలితాన్ని పక్కన పెట్టి కీర్తి సురేష్ ప్రస్తుతం తన అభిమానులతో సరదాగా ముచ్చట్లు పెడుతోంది.

    మిస్ ఇండియా సినిమా సందర్భంగా నేడు సాయంత్రం ఐదు గంటలకు లైవ్‌లోకి వస్తానని కీర్తి సురేష్ ముందే చెప్పింది. అయితే కీర్తి సురేష్ మాత్రం చెప్పిన టైంకు రాలేదు. కాస్త ఆలస్యంగా సమాధానాలు చెబుతూ వచ్చింది. నెటిజన్లు తమకు తోచిన ప్రశ్నలు సంధిస్తూ కీర్తి నుంచి సమాధానాలను రాబడుతున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కీర్తి సరదాగా సమాధానాలు చెప్పింది.

     Keerthy Suresh Answers To Netizens In Live session

    అక్కా నీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు అని ప్రేమగా అడిగాడు ఓ నెటిజన్.. తమ్ముడు ఎప్పుడూ కూడా ఎం ఎస్ ధోనియే నా ఫేవరేట్ అని ఎంతో ప్రేమగా రిప్లై ఇచ్చింది. మళ్లీ మా బబ్లీ కీర్తి సురేష్‌ను ఎప్పుడూ చూడగలము? అని ఇంకో నెటిజన్ అడిగాడు. త్వరలోనే అంటూ కీర్తి సురేష్ నవ్వేసింది. అంటే రాబోయే సినిమాల్లో మళ్లీ కీర్తి సురేష్ లావెక్కనుందేమో. అయినా ఈ స్లిమ్ లుక్కులో కంటే బబ్లీగానే కీర్తి సురేష్ ఎంతో ముద్దుగా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి.

    English summary
    Keerthy Suresh Answers To Netizens In Live session, Keerthy Suresh Live session On 4th November, Keerhty Suresh Miss India Trailer Out, Keerhty Suresh Miss India New Poster On Womens Day. She Posted That Where there is us, there is always magic! Wish you all a Happy Women’s Day on behalf of team
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X