ఆ సినిమాతో మహానటికి మరో షాక్.. అక్కడ కూడా ఫ్లాఫ్ దెబ్బ
గ్లామర్ ప్రజెంటేషన్స్ లో కాస్త కంట్రోల్ లో ఉండే బ్యూటీలలో కీర్తి సురేష్ ఒకరు. చూడగానే తన స్మైల్ తో ఎట్రాక్ట్ చేసే ఈ బ్యూటీ మహానటి సినిమాతో ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక విధంగా సావిత్రి పాత్రతో ఆమె జీవితానికి సరిపడా క్రేజ్ అందుకుందనే చెప్పాలి. అయితే ఆ క్రేజ్ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతోందనే కామెంట్స్ కూడా ఎక్కువవుతున్నాయి. అందుకు కారణం ఆమె గత సినిమాలు దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి.
లాక్ డౌన్ లో ఓటీటీలో విడుదలైన మొదటి ప్రముఖ సినిమాల్లో పెంగ్విన్ ఒకటి. సస్పెన్స్ త్రిల్లర్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఆ సినిమాతో సక్సెస్ కొట్టాలని అనుకున్న కీర్తి సురేష్ ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను అందుకుంది. ఇండస్ట్రీలో చాలా మంది ఆ సినిమాపై అప్పట్లో చాలా నమ్మకం పెట్టుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఆ సినిమా హిట్టయితే మిగతా వారు కూడా వారి సినిమాలను అలానే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్లాన్ రివర్స్ అయ్యింది. ఇక జీ ఛానెల్ సినిమా శాటిలైట్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేయగా ఇటీవల నవంబర్ 29న ప్రీమియర్స్ కు దారుణమైన రేటింగ్స్ అందుకుంది.

సినిమాకు కేవలం 3.64 రేటింగ్ మాత్రమే వచ్చిందట. చిన్న తరహా సీరియల్స్ కంటే కూడా ఈ సినిమాకు అత్యంత దారుణమైన రేటింగ్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే మిస్ ఇండియా సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వగా అది కూడా పెద్దగా హిట్టవ్వలేదు. మొత్తానికి మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మెల్లగా అపజయల బాట పడుతోందని కోలీవుడ్ లో టాక్ వైరల్ అవుతోంది. ఇక ఆమె ఆశలన్ని కూడా సర్కారు వారి పాట పైనే ఉన్నాయి. మరి ఆ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











