Keerthy Suresh: నటి కీర్తి సురేష్‌ మరో అరుదైన గౌరవం

Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్.. 2013లో 'గీతాంజలి' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత "నేను శైలజ" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం అయింది. ఆ తర్వాత నటన ప్రధాన పాత్రలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో "మహానటి" సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చింది. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు భారీ ప్రశంసలు, 'ఉత్తమ నటిగా' జాతీయ అవార్డు లభించాయి. మరిణ్తి, పెంగ్విన్, దసరా, సర్కారు వారి పాట వంటి విభిన్న సినిమాలతో సత్తా చాటింది. ఇటీవల 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

కీర్తి సురేష్ ఇటీవల వ్యక్తిగత జీవితం కొత్త దిశ పట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా నటనపై ఎంత మాత్రం తగ్గించుకోకుండా వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం రివాల్వర్ రీటా లో నటిస్తోంది. అలాగే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'రౌడీ జనార్థన్' లో హీరోయిన్‌గా కనిపించనుంది. ఇది ఆమె పెళ్లి తర్వాత నటిస్తున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం. నటనా ప్రాధాన్యమున్న పాత్రలే ఎక్కువగా చేసిన కీర్తి, వరుస చిత్రాలతో బిజీగా మారుతూ, కెరీర్‌ను కొనసాగిస్తోంది. తాజాగా నటి కీర్తి సురేష్‌కు అరుదైన గౌరవం దక్కింది.

Keerthy Suresh Becomes UNICEF Celebrity Advocate Joins Global Child Rights Mission

నటి కీర్తి సురేష్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునిసెఫ్‌ ఇండియా (UNICEF India) అధికారికంగా ఆమెను సెలబ్రిటీ ప్రచారకర్తగా నియమించింది. పిల్లల హక్కులు, మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రీ ప్రకటించారు.

ఈ పదవిని ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఆయుష్మాన్ ఖురానా, మాధురీ దీక్షిత్, ప్రియాంకా చోప్రా వంటి జాతీయ స్థాయి ప్రముఖులు నిర్వహించారు. ఇప్పుడు వారితోపాటు కీర్తి సురేష్ కూడా గ్లోబల్ చైల్డ్ రైట్స్ చర్చల్లో భాగమవడం సినీ ప్రపంచంలోనే కాకుండా సామాజిక వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.

యునిసెఫ్ నియామకంపై స్పందించిన కీర్తి సురేష్ మాట్లాడుతూ "పిల్లల శ్రేయస్సు మన కర్తవ్యమే కాదు, మన భాధ్యత కూడా. ప్రేమ, సంరక్షణే వారి భవిష్యత్తుకు పునాది. మరింత ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి తోడ్పడుతుంది. వారి నేపథ్యం, సామర్థ్యం ఎలా ఉన్నా ప్రతి పిల్లవాడి అభివృద్ధికి సమాజం కలిసి పనిచేయాలి. యునిసెఫ్‌తో చేతులు కలపడం నాకు గౌరవంగా భావిస్తున్నా" అని పేర్కొన్నారు.

మొత్తానికి.. "మహానటి"గా కోట్ల హృదయాలను గెలుచుకున్న కీర్తి సురేష్, ఇప్పుడు పిల్లల హక్కుల కోసం పోరాడే యునిసెఫ్ గ్లోబల్ ప్రతినిధిగా మరో అరుదైన మైలురాయి అందుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కీర్తికి అభినందనలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X