3-4 గంటలే నిద్ర.. బ్రేక్ ఉండదు.. పని గంటలపై కీర్తి కామెంట్స్..
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ అవర్స్, పని గంటలపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇండియాలో అత్యంత పెద్ద స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్', 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌ల నుంచి దీపికా పడుకోన్ వైదొలగడం లేదా ఆమెను తప్పించడం వెనుక కారణం ఇదే కావచ్చని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 'రోజుకు 8 గంటల షూటింగ్' అనే షరతు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా హీరోయిన్ కీర్తి స్పందిస్తూ తన అభిప్రాయం చెప్పింది.
కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అటు నార్త్.. ఇటు సౌత్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు, వెబ్ సీరిస్, ఓటీటీ సినిమాలు చేస్తూ.. బిబీబిజీగా మారింది. ఇక తాజాగా 'రివాల్వర్ రీటా'(Revolver Rita)గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు కీర్తి సురేశ్(Keerthy Suresh). ఈ సినిమా రేపు (నవంబర్ 28) విడుదల కానున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ మేకర్స్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. నటుల వర్కింగ్ అవర్స్‌పై కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానిపై కీర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

కీర్తి సురేష్ షూటింగ్ అవర్స్‌పై తన అనుభవాన్ని వివరిస్తూ.. "నేను ఎలాంటి షెడ్యూల్‌కైనా తగులుకునేలా పని చేయగలను. మహానటి సినిమా చేసేటప్పుడు.. అజ్ఞాతవాసి, సామి 2, సర్కార్, సందకోడు 2 షూట్‌ల్లో కూడా పాల్గొన్నాను. ఉదయం ఒక సినిమా సెట్లో షూట్ చేస్తే, మధ్యాహ్నం మరో ప్రాజెక్ట్, సాయంత్రానికి ఇంకో సినిమా ఇలా మూడు వేర్వేరు షిఫ్ట్‌ల్లో పని చేసిన రోజులు చాలానే ఉన్నాయి. ఇది నా శక్తికి, నా పనితీరుకు సరిపోయిన విధానం. కానీ అందరూ ఈ విధంగా పని చేయాలని చెప్పడం కుదరదు. ప్రతి నటుడి పరిస్థితి, సామర్థ్యం వేరుగా ఉంటుంది," అని కీర్తి తెలిపారు.
ఇక 9 నుంచి 6 వరకు రెగ్యులర్ షిఫ్ట్ గురించి కీర్తి సురేష్ మరింత స్పష్టతనిచ్చింది. '9 గంటలకు షూటింగ్ ఉన్నదంటే.. 7:30 వరకు సెట్ లోకి రావాలి. అంటే 6.30కల్లా ఇంటి నుంచి బయలుదేరాలి. ఇప్పుడీ లెక్క ప్రకారం 5.30కి నిద్రలేచి, తయారయ్యే బాధ్యత వస్తుంది' అన్నారు. ఇక సాయంత్రం 6.30కి షూట్ ముగిసినా.. వెంటనే ఇంటికి వెళ్లడం కుదరదు. "మేకప్ తొలగించుకోవడం, కాస్ట్యూమ్స్ మార్చుకోవడం ఇవి కూడా అరగంట నుంచి గంట వరకు పడతాయి. ఇంటికి చేరుకునే సరికి 8 గంటలు అవుతాయి. ఆ తర్వాత జిమ్, డిన్నర్... ఇవన్నీ పూర్తయ్యేలోపు 10.30 నుంచి 11.00 వరకు అవుతుంది. ఒక ఆరోగ్యకరమైన నిద్రకు 8 గంటలు కావాలి, కానీ నటులు మాత్రం రోజుకు 6 గంటలే పడుకుంటున్నారు," అని ఆమె వివరించారు. 9 నుంచి 9 వరకు లాంగ్ షిఫ్ట్‌లు అయితే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందని తెలిపారు.
మరీ ముఖ్యంగా టెక్నీషియన్స్ గురించి మాట్లాడిన ఆమె 'నటులు సెట్లోకి ఆలస్యంగా వచ్చి ముందే వెళ్లిపోతారు. కానీ లైట్, ఆర్ట్, కెమెరా వంటి టెక్నికల్ టీమ్ మరింత కష్టం పడుతుంది. వాళ్లు సెట్లోకి చాలా ముందే చేరి, చివర్లోనే బయలుదేరుతారు. వాళ్ల పని గంటలు చాలా కఠినంగా ఉంటాయి" అని చెప్పారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో 9 నుండి 6 షిప్ట్ వ్యవస్థ కనిపిస్తుండగా, మలయాళం, హిందీ పరిశ్రమల్లో 12 గంటల షిఫ్ట్ సాధారణమని ఆమె గమనించారు. 'మాలీవుడ్‌లో షూట్ మధ్యలో బ్రేక్ ఉండదు. లైట్‌మ్యాన్‌లకు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల నిద్ర పోతారని నేను భావిస్తున్నా'అని తెలిపారు.


Click it and Unblock the Notifications











