చిరంజీవి ఫ్యాన్స్‌కు కీర్తి సురేష్ క్షమాపణ.. బెస్ట్ డ్యాన్సర్ వివాదంపై క్లారిటీ..
Keerthy Suresh: నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా ప్రారంభించి, 2013లో 'గీతాంజలి'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన చిత్రం 'నేను శైలజ'. ఆ తర్వాత గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చింది కీర్తి. ఈ అమ్మడు 'మహానటి'సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం నార్త్, సౌత్ మూవీస్ బిజీబిజీగా ఉన్న ఈ అమ్మడు ఓ వివాదంతో వార్తల్లో నిలిచారు. మెగా అభిమానుల ఆగ్రహనికి లోనై.. నెట్టింట్లో ట్రోల్స్ గురవుతున్నారు. ఈ వివాదానికి ఎండ్ కార్డు వేస్తూ.. చిరంజీవి అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఇంతకీ వివాదం ఎంటీ? కీర్తి సురేష్ మెగా అభిమానులకు సారీ చెప్పడమేంటీ? వివరాల్లోకెళ్లే...
ప్రస్తుతం కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'రీవాల్వర్ రీటా'లో నటిస్తోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి కారణమయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా.. మెగాస్టార్ చిరంజీవి కన్నా దళపతి విజయ్ డాన్స్ బెటర్ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ.. చిరంజీవి గారిని అవమానిస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ తన ఫేవరెట్ డాన్సర్ అని చెప్పిన కీర్తి, 'భైరవ', 'సర్కార్'లో విజయ్‌తో నటించగా, చిరంజీవి సరసన 'భోళా శంకర్'లో సిస్టర్ పాత్రలో కనిపించింది.

ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం రివాల్వర్ రీటా ప్రమోషన్ కోసం హైదరాబాదులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీర్తి ఈ వివాదంపై పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సమయంలో కీర్తి సురేష్‌ను ఓ రిపోర్టర్ నేరుగా ప్రశ్నిస్తూ "చిరంజీవి ఇండస్ట్రీలోనే బెస్ట్ డాన్సర్. ఆయన డాన్స్ కు కు ఒక సింబల్.. మీరు మీ అభిమాన హీరో విజయ్ ? మీరు ఆ మాట అనడానికి కారణమేంటి? మీరు ఎలా విజయ్‌ను బెటర్ అని అన్నరు? " అని ప్రశ్నించారు.
దీనికి కీర్తి సమాధానమిస్తూ.. " ఇది తక్కువ- ఎక్కువ చెప్పిన విషయం కాదు. నేను చిరంజీవి గారిని ఎంత గౌరవిస్తానో... చిరంజీవి గారికి కూడా తెలుసు.నేను కూడా చిరంజీవి గారిని ప్రేమిస్తాను.ఆయనతో వర్క్ చేయడం నాకు గర్వకారణం. మెగాస్టార్ ను ఎంతగానో అభిమానిస్తాను. మీరు మాట్లాడుతున్న విషయాన్ని ఆల్రెడీ చిరంజీవి గారితో కూడా మాట్లాడాను. అయితే నా వ్యాఖ్యలు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటారని నేను భావించలేదు. ఒకవేళ చిరంజీవి అభిమానులను హర్ట్ చేసి ఉంటే క్షమించండి. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు' అని అన్నారు.
'చిరంజీవి గారిని తక్కువ చేసి చూడడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ చిరంజీవి గారు ఎలానో. అక్కడ విజయ్ సర్ అలానే.. ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్.. చిరంజీవి గారు ఎంత గొప్ప హీరోనో అందరికీ తెలుసు.. మా మమ్మీ కూడా అతనితో కలిసి నటించిన విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి గారు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ . కానీ చిరంజీవిని డిస్ట్రెస్పెక్ట్ గా మాట్లాడలేదు తక్కువ చేసి మాట్లాడలేదు' అంటూ కీర్తి క్లారిటీ ఇచ్చింది.
ఈ సమయంలో కీర్తి సురేష్ ఒక ముఖ్యమైన విషయం బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తెలిపానని. కానీ దానిని చిరంజీవిపై అవమానంగా ఎవరూ చూడకూడదని అన్నారు. "చిరంజీవి సార్ నన్ను పర్సనల్‌గా ఎన్నోసార్లు అడిగారు. నీకు ఎవరి డాన్స్ ఇష్టం? ఎవరి నటన ఇష్టం? అని.. అప్పుడే నేనే చెప్పాను డాన్స్ అంటే విజయ్ సర్, యాక్టింగ్ అంటే సూర్య సర్ అని". ఆ మాటలు విని చిరంజీవి నవ్వుతూ, "సెల్ఫ్ ఓపీనియన్ ఉండాలి, అది తప్పు కాదు" అని చెప్పారని ఆమె వివరించింది. ఈ విషయాన్నిచిరంజీవి గారు చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారని తెలిపారు.
అక్కడితో ఆ రిపోర్టర్ ఆగకుండా.. "చిరంజీవి ఆల్‌టైమ్ గ్రేట్, ఒక లెజెండ్. ఆయనను విజయ్‌తో పోల్చడం ఏంటీ?" అని మరోసారి ప్రశ్నించారు. దీనికి కీర్తి బదులిస్తూ.. "ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇద్దరూ లెజెండ్స్. చిరంజీవి గారు ఇండియాలో టాప్ యాక్టర్, మెగాస్టార్. విజయ్ సర్ తమిళ్‌లో లెజెండ్." అని ఆమె స్పష్టం చేసింది. "ఆ ఇంటర్వ్యూలో నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు... అందులో బెటర్ అని అనిపించిన పేరును చెప్పాను. చిరంజీవిని తక్కువ చేసి చూసే ఉద్దేశ్యమే లేదు... ఫ్యాన్స్ క్షమించండి. నేను ఎవరినీ డిస్రెస్పెక్ట్ చేయలేదు. ప్రత్యేకంగా చిరంజీవి గారిని కాదు " అంటూ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











