దానికి నేను బానిస.. నా భర్త సర్దుకుపోతాడు.. కీర్తి సురేష్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు 'మహానటి' సినిమాతో ఎవరూ ఊహించని విధంగా పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం,హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. తాజాగా కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్ (Antony Thattil)ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా తన ఆంటోని తటిల్ గురించి షాకింగ్ చేసింది. ఇంతకీ ఏమన్నదంటే..?
హీరోయిన్ కీర్తి సురేష్ .. 'నేను శైలజ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాలో తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. అదేవిధంగా మలయాళం, తమిళం, హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ .. తెరకెక్కించిన బయోపిక్ 'మహానటి' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది కీర్తి. ఆ సినిమా తో కీర్తి సురేష్ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.

దీంతో కీర్తి సురేశ్ పాన్ ఇండియా నాయకిగా గుర్తింపు పొందారు. అటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇలా వరుస విజయాలతో పుల్ ఫామ్ లో ఉన్న ఈ అమ్మడు డిసెంబర్ 12,2024న గోవాలో ఆంటోనీ తటిల్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత హనీమూన్ వెళ్తుందనుకుంటే, ఆమె నటించి 'బేబీజాన్'(Baby John)మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని తన ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది. ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో వివరించింది. తాను పెళ్లికి ముందు ఎలా ఉన్నానో.. ఇప్పడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నానని తెలిపారు. దీనికి కారణం తాము సుదీర్ఘ కాలంగా ఆంటోని డేటింగ్‌లో ఉన్నప్పుడే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నామనీ, అందువల్ల తనకు పెద్దగా ఛేంజ్ అంటూ ఏమీ లేదని అన్నారు. ఇక తన భర్త ఆంటోని తటిల్ ఎలా ఉంటాడో వివరించింది.
తాను ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటాననీ, కానీ ఆ విషయంలో తన భర్తకు కాస్త ఇబ్బంది పడుతారనీ, వాస్తవానికి సోషల్ మీడియాకు కాస్త అడిక్ట్ అయ్యాననీ, అయినా తనని అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో చాలా విషయాల్లో సర్దుకు పోతుంటారని చెప్పారు. తన వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుందని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











