చిరంజీవి కంటే ఆ హీరో గ్రేట్ అట.. కీర్తి సురేష్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్

ప్రెజెంట్ ట్రెండ్ లో సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో మహానటి కీర్తి సురేష్ కూడా ఒకామె అని అందరికీ తెలిసిందే. కాగా కీర్తి సురేష్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ్ సహా ఇప్పుడు హిందీ సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా కీర్తి సురేష్ గడుపుతుండగా లాస్ట్ గా అయితే మెగాస్టార్ చిరంజీవితో తన చెల్లెలిగా "భోళా శంకర్" సినిమాలో ఆమె కనిపించింది.

కాగా దీనికి ముందు కీర్తి చేసిన పలు చిత్రాలు తెలుగులో అంతగా రాణించలేదు. వాటి తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకున్న భోళా శంకర్ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంకా ఈ సినిమా కోసం ఆమె మరికొన్ని ఆఫర్స్ వదులుకుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఆ సినిమా కాదు వేరే సినిమా అని తెలిసింది. అయితే కీర్తి సురేష్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటే అయినప్పటికీ ఆమెని స్టార్ గా నిలబెట్టింది మన తెలుగు సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

keerthy suresh controversial statement on chiranjeevi over vijay question

కానీ మన తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఆమె చూపించిన అశ్రద్దని మాత్రం ఇపుడు ఎవరూ ఊహించలేదు. ఒక్క సౌత్ లోనే కాదు టోటల్ ఇండియా లోనే మెగాస్టార్ చిరంజీవికి ఒక సుస్థిర స్థానం ఉంది అని అందరికీ తెలిసిందే. అది నటనలో అయినా డాన్స్ లో అయినా కూడా చిరంజీవిని మ్యాచ్ చెయ్యడం ఎవరి తరం కాదని మెగా ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు.

లెజెండ్స్ కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి ఇద్దరినీ కలిపితే చిరు అని దిగ్గజ దర్శకుడు బాల చందర్ గారే సెలవిచ్చారు. ఇక డాన్స్ ల విషయంలో అయితే చిరంజీవి సెట్ చేసిన ట్రేడ్ మార్క్ కోసం అయితే చెప్పాల్సిన పనే లేదు. కానీ ఈ రెండు విషయాల్లో కీర్తి సురేష్ చిరుకి కాదని కోలీవుడ్ హీరో తలపతి విజయ్ కి ఓటేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

keerthy suresh controversial statement on chiranjeevi over vijay question

ఆమెకి రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో నటన, డాన్స్ విషయంలో చిరు లేదా విజయ్ ఎవరో ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి మొహమాటం లేదు విజయ్ నే ఎంపిక చేస్తాను అని చెప్పేసింది. దీనితో ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విజయ్ చిరుకి ఏ విషయంలో కూడా సరిపోడని మెగా ఫ్యాన్స్ ఈ కామెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కీర్తి సురేష్ కి విజయ్ అంటే ఇష్టమే కావచ్చు కానీ నటన, డాన్స్ విషయంలో మాత్రం మెగా అభిమానులు ఇస్తున్న కౌంటర్లులో మాత్రం నిజం లేకపోలేదని చెప్పాలి. ఈ ఏజ్ లో కూడా చిరు గ్రేస్ చెక్కు చెదరలేదు. కానీ విజయ్ పాత సినిమాలు నుంచి ఇప్పుడు వరకు తీసుకున్నా కూడా తనపై ఏ రేంజ్ ట్రోల్స్ పడుతుంటాయి అనేది అందరికీ తెలుసు.. సో కీర్తి చేసిన కంపేరిజన్ మాత్రం మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందనే చెప్పి తీరాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X