కీర్తి సురేష్ రెమ్యునరేషన్ కట్.. నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ పరిస్థితుల దెబ్బకు సినీ రంగమే కాకుండా అన్ని రంగాలు కుదేలు అవుతున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు తమ ప్లాన్లను, రెమ్యునరేషన్లను, పారితోషికాలను పున: సమీక్షించుకొంటున్నారు. సినిమా పరిశ్రమలో అయితే అగ్రతారలు తమ పరిధి మేరకు బడ్జెట్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో యువ హీరోయిన్ కీర్తీ సురేష్ కూడా నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. తన పారితోషికాన్ని తగ్గించుకొనేందుకు కీర్తీ ముందుకొచ్చినట్టు ప్రకటనలు వెలువడుతున్నాయి.
కోవిడ్ 19 కారణంగా సినిమాలు రిలీజ్ కాకపోవడం, థియేటర్లు మూసివేయడంతో చిత్ర పరిశ్రమ కార్యక్రమాలు స్తంభించాయి. దాంతో తమ సినిమాలను పలువురు నిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే జ్యోతిక నటించిన పోన్ మగళ్ వంధాల్ సినిమా, అలాగే అమితాబ్ నటించిన గులాబో సితాబో చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం జూన్ 19వ తేదీన రిలీజ్ కానున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. చిన్న సినిమాలకు అండగా నిలువడానికి, అలాగే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వీలుగా నిర్మాతలకు వెసలు బాటుగా ఉండేందుకు కీర్తీ సురేష్ తన పారితోషికాన్ని గణనీయంగా తగ్గించుకొన్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో కీర్తీ సురేష్ నిర్మాతలకు భరోసా ఇచ్చారని, దాదాపు 30 శాతం మేర తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారనే విషయాన్ని పేర్కొంటున్నారు. గుడ్ లక్ సఖీ, రంగ్ దే, మిస్ ఇండియా, రజనీకాంత్‌తో అన్నాతే చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











