For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినీ ప్రముఖుడితో ప్రేమలో పడ్డ కీర్తి సురేష్: త్వరలోనే వివాహం.. అతడితో అలా కలిసినప్పుడే ఫిక్స్!

  |

  సినీ ఇండస్ట్రీలో యాక్టర్ల మధ్య ప్రేమాయణం లేకున్నా.. ఏదో ఒక కారణం చూపించి మరీ ముడిపెట్టేస్తూనే ఉంటారు. అదే చిన్న హింట్ దొరికిందంటే చాలు.. లవ్ ట్రాకులు ఇట్టే బయటకు వచ్చేస్తుంటాయి. సీక్రెట్‌గా వ్యవహారం నడిపినా.. ఏదోలా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది కెమెరాల కంట పడిపోవడంతో అడ్డంగా బుక్కైపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో కీర్తి సురేష్ డేటింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఈ భామ ఓ సినీ ప్రముఖుడితో ప్రేమాయణం సాగిస్తుందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరతను? ఆ వివరాలు మీకోసం!

  అలా పరిచయం అయిన కీర్తి సురేష్

  అలా పరిచయం అయిన కీర్తి సురేష్

  ఎనర్జిటిక్ స్టార్ రామ్.. కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఆ వెంటనే నాని, పవన్ కల్యాణ్, నాగార్జున సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.

  ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు

  ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు

  కీర్తి సురేష్ కెరీర్‌లో ‘మహానటి' చిత్రం ఎంత ప్రత్యేకమైనదో చెప్పనక్కర్లేదు. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఇందులో కీర్తి చేసిన నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ఆమెకు జాతీయ అవార్డు సైతం దక్కింది. ఈ మూవీ ఆమె కెరీర్‌నే మార్చేసిందని చెప్పొచ్చు.

   అన్ని భాషల్లోనూ ఎంట్రీ.. ఫుల్ బిజీ

  అన్ని భాషల్లోనూ ఎంట్రీ.. ఫుల్ బిజీ

  బాలనటిగానే కెరీర్‌ను ఆరంభించిన కీర్తి సురేష్.. 2000 సంవత్సరంలోనే మలయాళ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ‘గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అప్పటి నుంచి ఆ భాషతో పాటు తెలుగు, తమిళంలోనూ చిత్రాలు చేస్తోంది. అన్ని చోట్లా ఆదరణ లభించడంతో వరుస ఆఫర్లు అందుకుంటోంది.

  కీర్తి ఎఫైర్‌పై ఆ మధ్య ఓ న్యూస్ వైరల్

  కీర్తి ఎఫైర్‌పై ఆ మధ్య ఓ న్యూస్ వైరల్

  కీర్తి సురేష్ గురించి ఆ మధ్య ఓ వార్త తెగ వైరల్ అయింది. ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతుందని ఆ వార్త సారాంశం. ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయినప్పటికీ అటు కీర్తి సురేష్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ దీనిపై స్పందించలేదు. దీంతో ఆమె పెళ్లి జరిగేది నిజమేనన్న టాక్ వినిపించింది. దీంతో ఇది నిజమేననుకున్నారు.

  సినీ ప్రముఖుడితో ప్రేమలో పడ్డ కీర్తి

  సినీ ప్రముఖుడితో ప్రేమలో పడ్డ కీర్తి

  తరచూ ఏదో ఒక వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది కీర్తి సురేష్. దీంతో అ అమ్మడు సినిమాల పరంగానే కాకుండా.. ఇలాంటి రూమర్ల వల్ల కూడా హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దక్షిణాదిలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన అనిరుథ్ రామచందర్‌తో కీర్తి సురేష్ ప్రేమాయణం సాగిస్తుందన్నదే ఆ వార్త సారాంశం.

  ఇద్దరూ కలిసి ప్రకటన.. త్వరలోనే పెళ్లి

  ఇద్దరూ కలిసి ప్రకటన.. త్వరలోనే పెళ్లి

  పలువురితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఎన్నో సార్లు వార్తల్లో నిలిచి అనిరుధ్.. తాజాగా కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసి ఒకేసారి ఈ విషయాన్ని వెల్లడించబోతున్నారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనతో పాటు తమ పెళ్లి గురించిన న్యూస్‌ను కూడా చెప్పబోతున్నారట. 2021 చివర్లో ఈ పెళ్లి జరగనుందని టాక్.

  అతడితో అలా కలిసినప్పుడే ఫిక్స్

  అతడితో అలా కలిసినప్పుడే ఫిక్స్

  గత ఏడాది అక్టోబర్‌లో 16న అనిరుథ్ పుట్టినరోజు జరిగింది.. తర్వాతి రోజే అంటే అక్టోబర్ 17న కీర్తి సురేష్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి అర్ధరాత్రి సమయంలో జంటగా కేక్ కట్ చేశారు. ఇది సీక్రెట్‌గా జరిగినా కోలీవుడ్ మీడియాకు మాత్రం తెలిసింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో కూడా బయటకు వచ్చింది. అప్పుడే వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి.

  English summary
  Keerthy Suresh is an Indian film actress and model who appears predominantly in Tamil, Telugu and Malayalam films. Keerthy is the daughter of producer G. Suresh Kumar and actress Menaka Kumar. Keerthy began acting as a child actress in the early 2000s and returned to films after studying fashion design.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X