Bholaa Shankar pre release మెగాస్టార్ ఎందుకయ్యారో తెలుసా? చిరంజీవి గురించి కీర్తి సురేష్ ఎమోషనల్
తమిళంలో సక్సెస్‌ఫుల్ చిత్రం వేదాళం సినిమా ఆధారంగా రూపొందుతున్న భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. మెగాస్టార్ చిరంజీవి, కీర్దీ సురేష్, తమన్నా భాటియా, శ్రీముఖి, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులు నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ వేడుకలో భాగమైన కార్తీ సురేష్ మాట్లాడుతూ..
మెగాస్టార్ ఫ్యాన్స్ బాగున్నారా? భోళా శంకర్ చిత్రంలో ప్రధాన ట్రాక్ ఉంది. సిస్టర్, బ్రదర్ ట్రాక్ సినిమాలో ఉంటే.. బయట నాకు అద్బుతమై బ్రదర్, సిస్టర్ రిలేషన్ దర్శకుడు మెహర్ రమేష్‌తో లభించింది. ఈ సినిమాలో సిస్టర్ పాత్ర కోసం నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు అని కీర్తీ సురేష్ అన్నారు. అలాగే చిరంజీవి పక్కన నన్ను కూడా అందంగా చూపించినందుకు సినిమాటోగ్రాఫర్ డడ్లీకి థ్యాంక్స్ అని అన్నారు.

భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తమన్నా భాటియా రాలేకపోయారు. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య మంచి కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. ఇప్పుడు తమన్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా దూసుకుపోతున్నారు. తమన్నాతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సుశాంత్‌తో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది అని
భోళా శంకర్‌లో చిత్రంలో చిరంజీవితో నటించిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. సినిమాకు ముందు మెగాస్టార్ అనే విషయం తెలుసు. సినిమా చేసేటప్పుడు చాలా కంఫర్ట్‌గా ఉంచారు. తోటి యాక్టర్లను చాలా బాగా చూసుకొంటారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ప్రతీ రోజు ఇంటి నుంచి భోజనం తెప్పించే వారు. అందుకు సురేఖ గారికి ధన్యవాదాలు అని అన్నారు.


Click it and Unblock the Notifications











