Dasara ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కీర్తీ సురేష్ ఘాటైన స్టెప్పులు.. చాలా అమాయకుడు.. క్యూట్ అబ్బాయి అంటూ
నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్‌లో భాగంగా అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ..

నమస్తే.. మీడియా మిత్రులకు అందరికీ నమస్తే.. మన నానీ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్ధం కావడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఫుల్‌గా రెడీ అయి రావాలని అనుకొన్నాను. పూలు పెట్టుకొని వెన్నెలగా రావాలని అనుకొన్నాను. కానీ బాంబేలో యాడ్ షూట్ కారణంగా డైరెక్ట్‌గా రావాల్సి వచ్చింది అంటుండగా.. పొట్టి అంటూ అభిమానులు అరిచారు. దాంతో మార్చి 30 తర్వాత మీరు వెన్నెల అని పిలుస్తారు అని కీర్తి సురేష్ అన్నారు.
దసరా సినిమా విషయంలో సత్యం గారికి నా థ్యాంక్స్. చాలా కష్టపడి చేశాం. నవీన్ నూలితో ఇంతకు ముందు వర్క్ చేశాను. ఈ సినిమా విషయంలో ట్రైలర్, టీజర్‌లో నన్ను అదిరిపోయేలా చూపించారు. అవినాష్ గారితో మహానటి చిత్రంతో చేశాను. ఈ సినిమాలో మంచి సెట్ వేశారు. నా క్యాస్టూమ్ డిజైనర్‌కు నా థ్యాంక్స్. ఈ సినిమాలో నా ఫ్రెండ్స్‌గా నటించిన అందరూ నాకు సోదరులతో సమానం. వారందరికి నా థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిన ఝాన్సీ, సముద్రఖని, సాయికుమార్, చాకో వండర్ ఫుల్ యాక్టర్లు. వారందరికి నా ధన్యవాదాలు అని కీర్తి సురేష్ తెలిపారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పాలంటే.. చాలా అమాయకుడు. ఒక క్యూట్ అబ్బాయి. తాను చాలా కష్టపడి కథ రాశారు. ఇది ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాం. కొత్త దర్శకుడి కథను నమ్మి.. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు నిర్మాత సుధాకర్ గారికి థ్యాంక్స్. దసరా సినిమాలో అన్ని అంశాలు కలిపి చేశాడు. శ్రీకాంత్ ఈ సినిమాతోనే ఆగిపోడు. టాలీవుడ్‌లో ఎన్నో అద్బుతాలు చేస్తాడు అని కిర్తీ సురేష్ చెప్పారు.
ధరణి పాత్రలో నటించిన నాని నేచురల్ స్టార్. నేను నానితో నేను లోకల్ సినిమాలో నటించాం. కానీ ఈ సినిమా మాకు ఇంకా లోకల్ మాదిరిగానే ఉంది. నానీ ఈ సినిమాలో కత్తి పట్టాడు. ఇక తెర మీదే మార్చి 30న చూడాలి అని కీర్తి సురేష్ అన్నారు. దీక్షిత్ శెట్టితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. దీక్షిత్ పెద్ద నటుడు అవుతారు అని చెప్పారు. తన స్పీచ్ తర్వాత చమ్కీల అంగీ పాటకు డ్యాన్స్ చేయగా ఈల వేసి గోల చేశారు. ఈ డ్యాన్స్ వివరాల్లోకి వెళితే..


Click it and Unblock the Notifications











