twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంగీత కచేరిలో కీర్తి సురేష్.. వైరల్ పిక్స్

    |

    మహానటి సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకుంది. నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కీర్తి సురేష్.. వరుసగా చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఈ లాక్డౌన్‌లో కీర్తి సురేష్ తన చిత్రాలతో సందడి చేసింది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో వచ్చిన మొదటి క్రేజీ చిత్రంగా పెంగ్విన్ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

    ఈ లాక్డౌన్ సమయంలో కీర్తి సురేష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఫుల్లు వర్కౌట్లు మల్లెతీగలా మారిపోయింది. తన పెట్‌తో కలిసి కీర్తి సురేష్ రచ్చ చేసింది. ఇక కీర్తి వయోలిన్ నేర్చుకోవడంలో ఫుల్లు శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. దళపతి విజయ్ కోసం కుట్టి స్టోరీ పాటను వయోలిన్ మీద ప్లే చేసి ట్రిబ్యూట్ ఇచ్చింది. వయోలిన్ వాయిస్తున్న వీడియోను షేర్ చేస్తూ విజయ్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది.

     Keerthy Suresh Family Become Musicians

    ఇక తాజాగా వీకెండ్ సందర్బంగా కీర్తీ సురేష్ ఇంట్లో సంగీత కచేరి పెట్టినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ జామ్ జామ్‌గా ఎంజాయ్ చేస్తున్నామని, నైక్ డైరీస్ నైక్ అండ్ అజ్జూ ప్రాంజీ అంటూ తలా ఒక వాయిద్యాన్ని పట్టుకుని కచేరి చేస్తున్నామని తెలిపింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతోంది. ఇక కీర్తి సురేష్ రంగ్ దే, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలతో ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

    English summary
    Keerthy Suresh Family Become Musicians, Fam Jam done right! Musical note Red heart #FamJam #NykeDiaries #NykeAndAjju #Pranji,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X