చెప్పులు తల దగ్గర పెట్టుకుని పడుకుంది.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. లాక్డౌన్‌లో కీర్తి సురేష్ చేసినంత రచ్చ మరో హీరోయిన్ చేయలేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై కీర్తి సురేష్ తన సత్తా చాటుతోంది. వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ దుమ్ములేపుతోంది. ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా వంటి చిత్రాలతో ఓటీటీలో దూకింది. పెంగ్విన్ చిత్రం అమెజాన్‌లో ఆ మధ్య అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

అయితే పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాల్లో కీర్తి సురేష్ నటనకు మంచి పేరు వచ్చినా.. హిట్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇక కీర్తి ఆశలన్నీ గుడ్ లక్ సఖీ చిత్రంపైనే ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టిన కీర్తి దీపావళిని ఫుల్ ఎంజాయ్ చేసింది. ఫ్యామిలీతో కలిసి దివాళిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. అయితే క్రాకర్స్ కాల్చి కాల్చి కీర్తి ఫుల్ అలిసిపోయినట్టు కనిపిస్తోంది.

Keerthy Suresh Feels sleepy After Enjoy Diwali Crackers

వెరైటీగా ఉన్న క్రాకర్స్ గన్నును కాల్చింది.. ఒక్కొక్క ఐటెం తరువాత మరొక్క క్రాకర్‌ను కాల్చుతూ ఫుల్ సందడి చేసింది. ఇక చివరకు అలిసిపోయి నేలపే అలా ఒళ్లు వాల్చింది. అయితే ఇందులో తన చెప్పులను మొహానికి దగ్గరగా పెట్టుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. అదేంటి అలా పెట్టుకున్నావ్.. ఏమైంది? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X