Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్టార్ హీరోలతో మహానటికి వరుస అవకాశాలు.. రెండేళ్ళ వరకు నో డేట్స్?
మహానటి సినిమాతో ఎప్పుడైతే సౌత్ లో మంచి సక్సెస్ అందుకుందో అప్పటి నుంచే కీర్తి సురేష్ కెరీర్ యూ టర్న్ తీసుకుంది. వరుస అవకాశాలు అందుకుంటూ తోటి స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తోంది. ఇప్పటికే సౌత్ లో ఉన్న సగం మంది స్టార్ హీరోలతో ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకుంది.
విజయ్, అజిత్, పవన్ కళ్యాణ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ అప్పుడప్పుడు కథలు నచ్చితే చిన్న హీరోలతో కూడా నటించడానికి ఒప్పుకుంటోంది. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొన్న పెంగ్విన్ సినిమాతో ఓటీటీలో పరవలేదనిపించే విధంగా యాక్టింగ్ తో మెప్పించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల వరకు ఫుల్ బిజీగా ఉండాల్సిందేనట. ఈ లాక్ డౌన్ లోనే అమ్మడికి పది సినిమాలకు పైగా ఆఫర్స్ వచ్చాయట. కానీ మహానటి మాత్రం కేవలం తనకు నచ్చిన కొన్ని కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది.
కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికే కీర్తి నాలుగైదు సినిమాల షూటింగ్ లను ఫినిష్ చేసేది. దీంతో మరికొన్ని సినిమాలను ఒప్పుకునేందుకు వీలుండేది. ఇక ప్రస్తుతం తమిళనాడులో వైరస్ ప్రభావం ఎక్కువవ్వడంతో ఇంకా ధైర్యంగా షూటింగ్స్ స్టార్ట్ చేయడం లేదు. అందుకే కీర్తి కూడా భవిష్యత్తులో డేట్స్ అడ్జస్ట్ చేయడం కూడరేదేమో అని తొందరపడి ఒప్పుకోవడం లేదు. వీలైనంత త్వరగా ప్రస్తుతం చేతిలో ఉన్న సగం సినిమాలను పూర్తి చేసుకోవాలని ఈ బ్యూటీ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.