Sarkaru Vaari Paata నేను పక్కన ఉంటే.. రష్మిక అంటూ కలవరించాడు.. అతడి వ్యవహారాన్ని లీక్ చేసిన కీర్తీ సురేష్

నాకు మంచి ఆఫర్ ఇచ్చిన మైత్రీ మూవీస్‌కు థ్యాంక్స్. గతంలో ఎన్నో ఆఫర్లు ఇచ్చారు. కానీ కుదర్లేదు. కానీ సర్కారు వారీ పాటకు కుదిరింది. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు దర్శకుడు పరుశురాంకు ధన్యవాదాలు. మైత్రీ నిర్మాతలు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్ అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ..

రష్మిక.. రష్మిక అంటూ

రష్మిక.. రష్మిక అంటూ


సర్కారు వారీ పాట సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించినందుకు థ్యాంక్స్. షూటింగులో నాతో పనిచేస్తూ పరుశురాం రష్మిక.. రష్మిక.. రష్మిక మందన్న పేరును కలవరించే వారు. ఒకవేళ మీరు రష్మికతో పనిచేసే ముందు మీరు కీర్తీ అని పిలుస్తారా లేదా అనేది చూడాలి అని పరుశురాం గురించి ఆసక్తికరమైన విషయాన్ని కీర్తీ సురేష్ వెల్లడించారు.

తమన్ నువ్వు గ్రేట్ అంటూ

తమన్ నువ్వు గ్రేట్ అంటూ


కళావతి క్యారెక్టర్‌లో మదిలో నిలిచేలా చూపించినందుకు డీవోపీ మధి గారికి థ్యాంక్స్. మంచి పాటలను అందించిన తమన్ గారికి నా థ్యాంక్యూ. మహానటి నుంచి కమర్షియల్ హీరోయిన్ చేశారు. మీరు లైవ్ ఈవెంట్స్ చేస్తూ.. రకరకాల పనులతో బిజీగా ఎలా ఉంటున్నారో తెలియడం లేదు. నీతో నాకు రెండో సినిమా. మరిన్ని సినిమాలు మీతో చేయాలని ఉంది అని కీర్తీ సురేష్ అన్నారు.

మ.. మ.. మహేష్ అంటూ ఫన్నీగా

మ.. మ.. మహేష్ అంటూ ఫన్నీగా

ఇక మ.. మ.. మ.. మహేష్ గురించి చెప్పాలి. అతడితో షూటింగ్ చేసినప్పుడు మహేష్ టైమింగ్ ఎలా మ్యాచ్ చేయాలనే భయం కలిగింది. డబ్బింగ్‌లో సినిమా చూసినప్పుడు ఆయన గ్లామర్‌ను ఎలా మ్యాచ్ చేశానా అనే టెన్షన్ కలిగేది. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ మాట్లాడనిస్తారా అనే భయం కలిగింది అని కీర్తీ సురేష్ అన్నారు.

ఉన్నారు.. విన్నారు.. మీ కోసం వస్తున్నారు..

ఉన్నారు.. విన్నారు.. మీ కోసం వస్తున్నారు..


మహేష్ బాబు గారు మీతో నటించడం చాలా గొప్ప అనుభవం. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మీరు లాక్‌డౌన్‌లో చాలా కష్టపడ్డారు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు. మీ అందరి గురించి ఆయన ఉన్నారు. ఆయన విన్నారు. ఆయన మీ ముందుకు వస్తున్నారు. అంటూ ట్రైలర్‌లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్‌ను చెప్పడంతో ఫ్యాన్స్ గోలగోల చేశారు. మహేష్ బాబు ముఖంపై చిరునవ్వు కనిపించింది.

నమత్రకు నా థ్యాంక్స్

నమత్రకు నా థ్యాంక్స్


ఇక సర్కారు వారీ పాట మే 12వ తేదీన థియేటర్‌లో రిలీజ్ అవుతున్నది. మీరందరూ సేఫ్‌గా వెళ్లి సినిమా చూడండి. అలాగే మహేష్ బాబు జీవితంలో రియల్ కళావతి నమ్రత గారికిి నా థ్యాంక్స్. ఈ సినిమా ప్రారంభం నుంచి నాకు అండగా నిలిచింది. అలాగే నా టీమ్ మెంబర్స్‌కు, ఆర్ట్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు.. మీ కళావతి సైనింగ్ ఆఫ్ లవ్ యూ అని కీర్తీ సురేష్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X