Keerthy Suresh: పెళ్లిపై కీర్తి సురేష్‌కు వరుస ప్రశ్నలు.. అసలు విషయం చెప్పేసిన మహానటి!
మహానటి సినిమాతో సూపర్ పాపులర్ అయింది బ్యూటిఫుల్ కేరళ కుట్టి కీర్తి సురేష్. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే దసరా మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ పై పెళ్లి రూమర్స్ తెగ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇటీవలే కీర్తి సురేష్ తండ్రి వివరణ ఇవ్వగా తాజాగా ఈ ముద్దుగుమ్మ సైతం క్లారిటీ ఇచ్చేసింది. అసలు పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ ఏం మాట్లాడిందనే వివరాల్లోకి వెళితే..
మహానటి కీర్తి సురేష్ మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రొడ్యూసర్ సురేష్ కుమార్, నటి మేనక కుమార్తెగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ఈ కేరళ ముద్దుగుమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. 2000 సంవత్సరంలో బాల నటిగా పరిచయం అయింది కీర్తి సురేష్. అలా చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో అనేక చిత్రాలతో అలరించింది కేరళ కుట్టి. తర్వాత 2013లో విడుదైలన మలయాళ సినిమా గీతాంజలి ద్వారా మొదటగా హీరోయిన్ గా పరిచయం అయింది.

ఇటీవల దసరాతో మంచి హిట్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. అలాగే 'రివాల్వర్ రిటా', 'రఘు తాత' సినిమాలు కూడా చేస్తోంది. అంతేకాకుండా ఆమె నటించిన మరో తమిళ చిత్రం 'మామన్నన్' (Maamannan). తాజాగా ఈ మూవీ ఆడియో రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారట.. నిజమేనా అని వరుసగా ప్రశ్నలు వేశారు. దీంతో కీర్తి సురేష్ కాస్తా అసహనం వ్యక్తం చేసింది.
"నా పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి నేను ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా దాని గురించే ఎందుకు అడుగుతున్నారు. ఆ విషయంపై ఎందుకింత ఆసక్తిగా ఉన్నారు. నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను. దాని గురించి మీరు ప్రెస్ మీట్ లలో ప్రతిసారి అడగొద్దు. ఇలాంటి ప్రశ్నలు కాదు.. సినిమాకు సంబంధించినవి అడగండి" అని సమాధానం ఇచ్చింది బ్యూటిఫుల్ కీర్తి సురేష్.

ఇటీవల కీర్తి తండ్రి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. మా అమ్మాయి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషాలపై రూమర్స్ క్రియేట్ చేయొద్దు. దీని కారణంగా ఫ్యామిలీలో మనశ్శాంతి లేకుండా పోతుంది అని పేర్కొన్నారు. మరి ఇప్పుడైనా కీర్తి పెళ్లి రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











