ఆ సినిమాలో నటించడం కుదరదు.. షాకిచ్చిన కీర్తి సురేష్, ప్రారంభమై మధ్యలోనే!

నేను శైలజ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్. ఇటీవల విడుదలైన సర్కార్ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. కీర్తి సురేష్ గ్లామర్ షో విషయంలో హద్దులు పాటిస్తుంది. అయినా కూడా కీర్తి సురేష్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం కీర్తి సురేష్ నటనే. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం కీర్తి సురేష్ ప్రత్యేకత. కీర్తి సురేష్ తొలి చిత్రం నేను శైలజ. అంతకంటే ముందుగానే టాలీవుడ్ లో కీర్తి సురేష్ అవకాశం వచ్చింది. ఆ చిత్రం మరోమారు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

నరేష్ తనయుడు హీరోగా

నరేష్ తనయుడు హీరోగా

సీనియర్ హీరో నరేష్ తనయుడు నవీన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా గతంలో ఓ చిత్రానికి ప్లాన్ చేశారు. వాస్తవానికి వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అతిధులుగా భారీ స్థాయిలో ఈ చిత్రం లాంచింగ్ జరిగింది. కొంతభాగం షూటింగ్ జరిగిన తరువాత అనుకోని కారణాల వలన ఈ చిత్రం ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ చిత్రం అలాగే మరుగున పడిపోయి ఉంది.

నేను శైలజతో

నేను శైలజతో

ఈ లోపు కీర్తి సురేష్ కు నేను శైలజ చిత్రంలో అవకాశం రావడం, ఆ చిత్రం విడుదలై విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఇక నవీన్ మాత్రం నందిని నర్సింగ్ హోమ్ చిత్రంతో లాంచ్ అయ్యాడు. ఈ లోపు కీర్తి సురేష్ టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, విజయ్, నాని లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.ఇప్పుడు హీరోయిన్ గా కీర్తి సురేష్ రేంజ్ వేరు.

 మహానటి

మహానటి

ఈ ఏడాది కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో మహానటి పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా కీర్తి సురేష్ నటనా నైపుణ్యం పూర్తిగా బయటకు వచ్చింది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న కీర్తి సురేష్ కెరీర్ దూసుకుపోతున్న తరుణంలో.. తన మొదటి చిత్రం మరో మారు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ ప్రారంభించాలని

మళ్లీ ప్రారంభించాలని

నరేష్ తనయుడు హీరోగా ప్లాన్ చేసి మధ్యలో ఆగిపోయిన ఆ చిత్రాన్ని మళ్లీ పట్టాలపైకి తీసుకుని వెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ ని అడిగితే.. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తానని సినిమాలో మాత్రం నటించనని తేల్చి చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో నిర్మాతలు మరో హీరోయిన్ ని వెతుక్కుంటారేమో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ సౌత్ లో కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X