కళావతి పాటకు కీర్తి సురేష్ సెక్సీ డ్యాన్స్.. మహేష్ బాబు స్టెప్పులతో ఆ అందాలను చూపిస్తూ..
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంక్రాంతికి రావల్సిన ఈ సినిమా వివిధ కారణాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిశ్చయించారు. ఇక సినిమా విడుదల డేట్ వచ్చినప్పటి నుంచి కూడా సినిమాకు సంబంధించిన పాటలు కూడా విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన కలవతి పాట మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ పాటను ప్రతి ఒక్కరు కూడా ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు. హీరోయిన్ కీర్తిసురేష్ కూడా మొదటిసారి కళావతి పాటకు సంబంధించిన మహేష్ బాబు స్టెప్పులు తో అదరగొట్టేసింది. ఆ వీడియోలో కీర్తి సురేష్ కాస్త ఘాటుగా అందాలను హైలెట్ చేస్తూ కనిపించింది.

అలా వాయిదా
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు ఇతరులకు చాలా గ్యాప్ వచ్చింది. సర్కారు వారి పాట సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మహేష్ బాబు చాలా ప్రయత్నాలు చేసాడు కానీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు.. అంతేకాకుండా RRR కోసం రాజమౌళి కూడా మహేష్ బాబుని వాయిదా వేసుకొమ్మని ప్రత్యేకంగా మాట్లాడడంతో పోటీ ఉండకూడదు అని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

మొదటి సాంగ్..
ఇక మొత్తానికి సర్కారు వారి పాట సినిమాను మే నెలలో విడుదల చేయబోతున్నాం విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో గీతగోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక థమన్ సంగీతం కూడా సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. రీసెంట్ గా వచ్చిన మొదటి పాట కళావతి సోషల్ మీడియా లో సరి కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

కీర్తి సురేష్ సెక్సీ డ్యాన్స్
కళావతి పాట మహేష్ బాబు కీర్తి సురేష్ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగా హైలెట్ అయ్యింది. ఇక ఆ పాటను తన ఇంట్లో ప్లే చేసిన కీర్తి సురేష్ మహేష్ బాబు వేసిన స్టెప్పులు కూడా ఎంతో సెక్సీగా వేసింది. అంతేకాకుండా అందాలను కూడా హైలెట్ చేస్తూ మొదటి సారి అమ్మడు చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది. ఇక ఫోటో చూసిన నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

సరికొత్త రికార్డ్
ఈ సినిమాకు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళావతి పాటతోనే చాలా క్లారిటీగా అర్థం అయింది. విడుదలకు ముందు సోషల్ మీడియాలో లీక్ అయినప్పటికీ కూడా యూట్యూబ్ లో ఈ పాట భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది. తెలుగు ఇండస్ట్రీ లో 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న లిరికల్ పాటగా కూడా సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.
Recommended Video
భారీ బడ్జెట్ తో సర్కారు వారి పాట
ఫైనల్ గా ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.. ఇక మొదటి పాట సక్సెస్ కావడంతో మరి కొన్ని పాటలను కూడా వచ్చే నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది అని చిత్ర నిర్మాతలు నమ్ముతున్నారు. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ రాజమౌళి సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











