కీర్తి సురేష్ రెండో పెళ్లి .. లిప్ కిస్‌తో షాకిచ్చిన 'మహానటి'.. పిక్స్ వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆనతి కాలంలోనే మంచి ఫేమ్‌ని తెచ్చుకున్న సౌత్ హీరోయిన్స్‌లో తన పెర్ఫామెన్స్‌తో నాచురల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ కూడా ఒకామె అని చెప్పాలి. తెలుగులో నేను శైలజ చిత్రంతో ఒక హోమ్లీ ఎంట్రీ ఇచ్చి నెక్స్ట్ ఒక మాస్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు సహా తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన కీర్తి ఇపుడు సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది.
అయితే ఆమె సినీ కెరీర్ కొంచెం గాడి తప్పింది అనే సమయంలోనే తన పర్శనల్ లైఫ్ ని రంగులమయంగా మార్చుకుంది. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ప్రేమ పుకార్లు వార్తలని దాచి ఉంచి ఫైనల్ గా బయటపెట్టింది. తన స్నేహితుడు కం ప్రేమికుడు అయినటువంటి ఆంటోని తట్టిని ప్రపంచానికి పరిచయం చేసి ఏకంగా అతనితో కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నట్టుగా రివీల్ చేసి షాకిచ్చింది.

అప్పటికే కీర్తి సురేష్‌పై ప్రేమ, పెళ్లి అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యిన నేపథ్యంలోనే మొదట మౌనంగానే ఉండి కన్ఫర్మ్ చేయగా నెక్స్ట్ తన ప్రేమని ఆ తర్వాత పెళ్లిని కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఈ నేపథ్యంలోనే ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు చేసుకోబోతోందని మేం ముందే రివీల్ చేసాము. ఇపుడు మేము చెప్పినట్టుగానే కీర్తి సురేష్ తన ప్రేమికుడినే రెండు సార్లు పెళ్లు చేసుకుంది.
కీర్తి గోవాలో హిందూ సంప్రదాయంలో, అలాగే తన భర్త ఆంటోనీ తట్టి అనుసరించే క్రైస్తవ సాంప్రదాయంలోనూ పెళ్లి చేసుకుంటుంది అని మేం ముందే తెలిపాము. దీని ప్రకారం తొలుత హిందూ సంప్రదాయంలో జరిగిన పెళ్లి పిక్స్ బయటకి రాగా సినీ ప్రముఖులు ఈ యువ జంటకి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక లేటెస్ట్‌గా కీర్తి సురేష్ క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగిన మ్యారేజ్ పిక్స్‌ని షేర్ చేసుకోవడంతో అవి మరింత వైరల్ అయ్యాయి.
అయితే కీర్తి సురేష్ వీటిలో మొదటిగా పెట్టిన ఫోటోనే ఇపుడు హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన భర్తతో వారి ప్రేమకి ప్రతీకగా లిప్ లాక్ పెట్టుకొని పెద్దల సమక్షంలో తమ పెళ్లి గ్రాండ్‌గా చేసుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో కీర్తి సురేష్ ఏ హీరోతో లిప్ లాక్ చేసింది లేదు. ఆ విజువల్స్ కూడా ఏమీ లేవు . దీనితో తన నుంచి ఈ స్పెషల్ మూమెంట్ ఇపుడు ఆడియన్స్‌కి ఒకింత షాకింగ్‌గా అనిపించింది .
దీంతో తన ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ హ్యాపీ మూమెంట్స్ పక్కన పెడితే కీర్తి సురేష్ తన తొలి హిందీ చిత్రం "బేబీ జాన్" చేస్తుంది. ఈ సినిమా కూడా ఈ డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతానికి తన ఆశలు అన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది కీర్తి.


Click it and Unblock the Notifications











