twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయంతో ఆ సినిమాను దూరం చేసుకున్న ఉప్పెన బ్యూటీ.. ధైర్యంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహానటి?

    |

    ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్టులో చేరుతోంది. మొదటి సినిమా విడుదల కాకముందే ఒకేసారి నాలుగైదు ఆఫర్లు దక్కించుకున్న కృతి ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేయడానికి ఒప్పుకుంటోంది. ఇక నిత్యం ఏదో ఒక ఆఫర్ వస్తుండడంతో కృతి శెట్టి కొన్నిటికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఒప్పుకోవడం లేదట. అయితే మరికొన్ని పాత్రలు మాత్రం రిస్క్ చేయలేక ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. రీసెంట్ గా ఒక పాత్ర నచ్చినప్పటికి కూడా కృతి శెట్టి రిస్క్ చేయలేక రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక అదే పాత్రను మహానటి కీర్తి సురేష్ మాత్రం వినగానే ఒప్పేసుకుందట. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఎవరిది అనే వివరాల్లోకి వెళితే..

    ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాకుండా తమిళంలో కూడా ఈ బ్యూటీకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. చిన్నతనంలోనే యాడ్స్ లో నటించి ఆ తర్వాత మోడలింగ్ లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఇక ప్రయత్నం లోనే మంచి అవకాశాలు రావడంతో అటువైపు పెద్దగా ఫోకస్ చేయలేదు. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మరో మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

    Keerthy suresh green signal to Krithi Shetty rejected project

    వరుసగా రెండు సినిమాలు సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ పారితోషకం కూడా ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం పాత హీరోయిన్స్ హవా తగ్గడంతో అందరూ కూడా అందమైన కొత్త హీరోయిన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక వారిలో కృతి డామినేషన్ ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇక బంగార్రాజు సినిమాలో నటించడం కోసం ఈ అమ్మడు ఏకంగా కోటికి పైగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇక వరుసగా ఆఫర్లు వస్తుండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్న కృతి శెట్టి ఇటీవల ఒక సినిమాలో తల్లి పాత్రలో నటించడానికి ఒప్పుకోలేక భయపడిందట. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గానే కాకుండా ఒక చిన్న పాపకు తల్లి పాత్రలో కనిపించాలని దర్శకుడు కథను వివరించాడట అయితే ఆ మాట వినగానే కొంత ఆలోచించి రిస్క్ చేయలేనని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. చల్ మోహన్ రంగా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ చేయబోయే కొత్త సినిమా.

    ఆ సినిమాలో హీరోయిన్ ఒక చిన్న పాపకు తల్లి గా కనిపించే క్యారెక్టర్ ఉంటుందట. సినిమా కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ కూడా కృతి శెట్టి కెరీర్ మొదట్లోనే తల్లి గా కనిపించి రిస్క్ చేయలేను అని చెప్పిందట. ఆమె రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మహానటి కీర్తి సురేష్ మాత్రం కథ వినగానే సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరలోనే తెలియజేయనున్నారు. మరి కృతి శెట్టి రిజెక్ట్ చేసిన ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Keerthy suresh green signal to Krithi Shetty rejected project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X