హోస్ట్ గా మారబోతోన్న మహానటి కీర్తి సురేష్.. అందరికంటే ప్రత్యేకంగా..

నేను శైలజా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ పెద్దగా గ్లామర్ డోస్ పెంచకుండానే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఈ బ్యూటీ కేవలం నటనతోనే తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటుంది. చిరునవ్వుతోనే యువకుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకునే కీర్తి సురేష్ సినిమా సినిమాకు తన స్థాయిని కూడా పెంచుకుంటూ వెళుతోంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని ఒక గట్టి నమ్మకం అయితే అభిమానుల్లో ఏర్పడింది. ముఖ్యంగా మహానటి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ నటీమణి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన జీవితానికి సరిపోయేలా గౌరవాన్ని కూడా అందుకుంది అని చెప్పవచ్చు.

అగ్ర హీరోలు కూడా ఆమెతో నటించాలని అని అనుకునేంత వరకు వచ్చింది. కీర్తి సురేష్ తో ఇప్పటికే కొంతమంది అగ్రహీరోలు కూడా నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు కూడా నటించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కీర్తి సురేష్ కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలని చూస్తోంది. ఇటీవల కాలంలో సమంత తమన్నా వంటి వారు బుల్లితెరపై పలు రియాలిటీ షోలతో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే కీర్తి సురేష్ కూడా అదే తరహాలో ఏదైనా ప్రత్యేకంగా చేయాలని చూస్తోంది. హోస్టింగ్ లో అయితే అందరికంటే భిన్నంగా ఆమె అడుగులు వేయాలని అనుకుంటుందట. ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించబోయే టాక్ షోలో కీర్తి సురేష్ పోస్ట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Keerthy suresh hosting plans with big entertainment channel

ఆ టాక్ షో ఏకంగా ఒకేసారి నాలుగు భాషల్లో ప్రసారమయ్యే లాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కీర్తి సురేష్ కు మంచి ఆదరణ ఉంది కాబట్టి అన్ని భాషల్లో క్లిక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తకి కూడా ఆ నాలుగు బాషాలపై పట్టు ఉంది. ఇక స్థానిక భాషలకు చెందిన సెలబ్రిటీలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయించడమే కాకుండా కొన్ని గేమ్స్ కూడా ఆడిస్టారని తెలుస్తోంది.

మొదటిసారి హోస్ట్ గా చేయబోయే కీర్తి సురేష్ ఎలాంటి ఆదరణను అందుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న బోళా శంకర్ సినిమాలో కూడా మెగాస్టార్ కు సిస్టర్ పాత్రలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా కీర్తి సురేష్ కు చాలా ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. రెండింటిలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా కూడా ఆమె స్థాయి మరో లెవెల్ కి వెళ్లినట్లు లెక్క. ఇక ఇటీవల కాలంలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేష్ కుటుంభ సభ్యులు కొట్టిపారేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X