మహానటి రేంజ్‌లో హిట్టుకొట్టాలని అనుకుంది.. చివరికి ఇలా..
మహానటి సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమా ఆమెకు జీవితాంతం సరిపోయేంత కీర్తిని అందించింది. ఆ సినిమా ప్రభావం కారణంగా కీర్తి సురేష్ తన తదుపరి సినిమాలతో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని అందుకుంది. అందుకే కొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా నచ్చక వదులుకుంది.
మహానటి తరువాత ఇంతవరకు కీర్తి సురేష్ తెలుగు తెరపై హీరోయిన్ గా కనిపించలేదు. ఆ మధ్య మన్మథుడు 2లో కేవలం ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే మెరిసింది. అయితే మహానటి సినిమా తరువాత అమ్మడు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న చిత్రం పెంగ్విన్. ఈ సినిమాలో ఎమోషనల్ కాంటెంట్ తో పాటు సరికొత్త థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని సినిమా తప్పకుండా తన గత సినిమాల కంటే మంచి విజయాన్ని అందుకుంటుందని కీర్తి గత ఇంటర్వ్యూలలో తెలిపింది.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడం లేదు. మంచి డీల్ సెట్టవ్వడంతో నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 19న సినిమా వెబ్ ఫ్లాట్ ఫార్మ్ లో సందడి చేయనుంది. పెంగ్విన్ సినిమా తమిళ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ చేసి సక్సెస్ కొట్టాలని అనుకున్న కీర్తి సురేష్ ఆశలు చివరికి ఇలా.. లాక్ డౌన్ వల్ల అవిరైపోయాయి. మరి అమెజాన్ ప్రైమ్ లో సినిమాకు ఎలాంటి టాక్ అందుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











