twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో బాబోయ్.. ఇక అలాంటి చిత్రాల జోలికి పోను.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్

    |

    మహానటి సినిమా తర్వాత అందాల నటి కీర్తి సురేష్ కెరీర్‌ తారాజువ్వలా నింగికి ఎగిసింది. తనదైన నటనతో అగ్రశ్రేణి హీరోయిన్‌గా మారింది. దక్షిణాదిలో మహానటి చిత్రం కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా పందెం కోడి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కీర్తి సురేష్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఆమె ఏమన్నారంటే...

    మహానటి క్రేజ్‌తో

    మహానటి క్రేజ్‌తో

    మహానటి సావిత్రీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మదిని దోచుకొన్నాను. చాలా మంది అలాంటి పాత్రల్లో నటించాలని కోరుకొంటున్నారు. మహానటి తర్వాత వస్తున్న స్పందన మాటల్లో చెప్పలేను అని కీర్తి సురేష్ వెల్లడించింది.

    బయోపిక్స్‌లో నటించేది లేదు

    బయోపిక్స్‌లో నటించేది లేదు

    ఇక నుంచి బయోపిక్ చిత్రాల్లో నటించవద్దని నేను నిర్ణయం తీసుకొన్నాను. సావిత్రి పాత్రను నాకు ఆఫర్ చేసినప్పుడు నేను సరిగా నటిస్తానో లేదో అనే భయం కలిగింది. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసి మ్యాజిక్ చేయగలనా అనే ఫీలింగ్ వెంటాడింది. మళ్లీ అలాంటి పాత్ర చేస్తే ఆకట్టుకోగలనా అనే అనుమానం కలుగుతున్నది అని కీర్తి పేర్కొన్నది.

    మహానటి నాకు ఓ కిరీటం

    మహానటి నాకు ఓ కిరీటం

    సావిత్రి పాత్రలో నటించి మెప్పించడం నా లభించిన వరంగా భావిస్తాను. మహానటి చిత్రం నా కెరీర్‌కు కిరీటం లాంటింది. అలాంటి మధురానుభూతిలోనే ఉండాలనుకొంటున్నాను. అందుకే బయోపిక్‌లో నటించకూడదని నిర్ణయం తీసుకొన్నాను అని కీర్తి సురేష్ చెప్పింది.

    ఆ సినిమాలు ఫ్లాప్

    ఆ సినిమాలు ఫ్లాప్

    మహానటి తర్వాత నేను నటించిన సినిమాలు పెద్దగా పేరు తీసుకురాలేదు. అజాతవాసి, తాన్న సెర్నదా కూట్టం, సీమ రాజా, సామీ 2 సినిమాలు అంతగా ఆడలేదు. కానీ పందెం కోడి 2 సినిమాలోని పాత్రకు మంచి పేరు వస్తుందని కీర్తీ సురేష్ ఆశాభావం వ్యక్తం చేసింది.

    English summary
    Actress Keerthy Suresh, who has released her next film Sandakozhi 2, has got rave reviews for his acting in Savitri's biographical movie Mahanati, but she has decided to not to act in any biopic in coming day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X