స్టార్ హీరోలకు చెల్లెలిగా అందుకే చేస్తున్నా.. కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని నటిగా నిలదొక్కుకుంది. ఒక రకంగా ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఒక్క సారిగా నెక్ష్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. చాలా తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. మహానటి దెబ్బతో ఆమెకు అన్నీ లేడీ ఓరియెంటెడ్ పాత్రలు రావడం మొదలయ్యాయి. అయితే ఈ సినిమా తరువాత ఆమె అనేక సినిమాలు చేశారు కానీ ఆమెకు ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. అయితే జయాపజయాలు లెక్క లేకుండా ఆమెకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఇక సూపర్ స్టోర్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాత్రలో కీర్తి నటించగా ఆమె పాత్రకు మంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. మే 12న విడుదలైన సర్కారు వారి పాట సినిమా మంది హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఇలా స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్లు అందుకుంటున్న కీర్తి సురేష్ మరోవైపు చెల్లెలు పాత్రలను కూడా ఒప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆ మధ్య రజినీ కాంత్ నటించిన పెద్దన్న సినిమాలో సూపర్ స్టార్ చెల్లెలిగా నటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది కీర్తి. ఆ వ్యవహారం అక్కడితో ముగిసింది అనుకుంటూ ఉండగా ఆమె ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలోనూ చిరు చెల్లిగా నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాలం సినిమాకు ఈ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి ఇలా చెల్లెలి పాత్రలు చేయడం ఏమిటా అని చాలా మంది అనుమాన పడుతూ ఉంటారు.

 Keerthy Suresh intresting comments on sister roles

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కీర్తి తాను చెల్లి పాత్రలు చేయడానికి గల కారణాలు బయట పెట్టింది కీర్తి సురేష్. ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే చెల్లి పాత్రలు వచ్చినా కాదనకుండా చేస్తున్నానని అన్నారు. తనకు ఎప్పటి నుంచో రజినీకాంత్ గారితో నటించాలని ఉండేదని.. ఆ అవకాశం దొరకడం చాలా కష్టం అని అందుకే పెద్దన్నలో చెల్లి పాత్ర చేశానని ఆమె చెప్పుకొచ్చింది..అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం అని పాత్ర ప్రాధాన్యతను బట్టి భోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను అని కీర్తి సురేష్ పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X