మెగాస్టార్ మూవీ కోసం సాయి పల్లవికి పోటీగా మహానటి..?
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అనంతరం వరుసగా రెండు సినిమాలను ఒకేసారి లైన్ లోకి తేవాలని చూస్తున్నాడు. దీంతో ఆయనతో పని చేయాల్సిన దర్శకులు ముందుగానే పక్కా ప్లాన్ తో రెడీ అవ్వాలని చూస్తున్నారు. ఇక సినిమా కథకు అవసరమయ్యే నటీనటులను కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ వేదళం రీమేక్ లో నటించబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక నటీనటులను ఎంపిక చేసుకోవాలని దర్శకుడు మెహర్ రమేష్ ఇప్పటికే కొన్ని ఆడిషన్స్ నిర్వహించారు. ఇక మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది. తమిళ్ లో అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొదట ఆమెనే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్న దర్శకుడు ఆ తరువాత సాయి పల్లవిని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కొత్తగా క్యారెక్టర్ ని డిజైన్ చేశాడట.

ఆల్ మోస్ట్ సాయి పల్లవి ఫిక్స్ అయ్యిందని అనుకున్న సమయానికి ఇప్పుడు మరో మహానటి లిస్ట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ అయితే బావుంటుందని మరోసారి చర్చలు మొదలు పెట్టినట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో రంగ్ దే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కూడా హీరోయిన్ గా అనిపిస్తున్న ఈ బ్యూటీ తమిళ్ లో కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. మరి మెగాస్టార్ మూవీలో ఈ బ్యూటీ నటిస్తుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులో వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











