Keerthy Suresh: స్లీవ్ లెస్ చీరలో కీర్తి సురేష్ గ్లామర్ షో.. స్టన్నింగ్ గా 'మహానటి' స్టిల్స్

మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇక మహానటి సినిమాతో మహానటి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంది. ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఎక్కువగా హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలు చేసి ఫ్లాప్ లు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో దేవకన్యలా దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ సారీలో కీర్తి సురేష్ పోస్ట్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేద్దామా!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ..


చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో వచ్చిన 'గీతాంజలి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె నటనతో తగిన గుర్తింపు తెచ్చుకుంది.

అలనాటి తార సావిత్రి జీవిత కథతో..

అలనాటి తార సావిత్రి జీవిత కథతో..


కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. కెరీర్ ప్రారంభంలో అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది.

 కెరీర్ పరంగా ఫుల్ బిజీగా..

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా..

కెరీర్ ఆరంభంలోనే కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది. దీంతో అన్ని చోట్ల ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అలాగే సినిమాలు సక్సెస్ అయినా అవ్వకపోయినా కూడా ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి.

 మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే..

మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే..


కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే ఓకే చేస్తోంది. అయితే కీర్తి సురేష్ ఆ మధ్య ఎక్కువగా మిస్​ ఇండియా, గుడ్​ లక్​ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపింది. ఆ సినిమాలు ఫలితాలు కూడా తారామారు అయ్యాయి.

కాస్తా గ్లామర్ ఒలకబోసి...

కాస్తా గ్లామర్ ఒలకబోసి...

అలాగే గాంధారి అనే ప్రైవేట్​ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్​. ఇక ఇదంతా కాదని, ఇటీవల సూపర్ స్టార్ మహేశ్​ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్​ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. మంచి కలెక్షన్లు రాబట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ అకౌంట్​లో ఓ హిట్​ ఉండేలా చేసింది.

 అదే కావాలంటూ ఫ్యాన్స్..

అదే కావాలంటూ ఫ్యాన్స్..

ఎప్పుడు హోమ్లీగా కనిపంచిన కీర్తి సురేష్.. సర్కారు వారి పాట సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసేసరికి ఆమె ఫ్యాన్స్ అదే కావాలని మారాం చేస్తున్నారు. కీర్తి సురేష్ కూడా అలాగే హాట్ గా దర్శనమిస్తూ వస్తోంది. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న కీర్తి సురేష్.. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. ఫలితంగా ఈ అమ్మడు తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

 దేవకన్యలా కీర్తి సురేష్..

దేవకన్యలా కీర్తి సురేష్..

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ తాజాగా కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. ఇందులో ప్లవర్ ప్రింట్ ఉన్న తెల్ల చీర కట్టుకుని దేవకన్యల దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌస్ లో గ్లామర్ తో యువతను ఆకట్టుకుంటోంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. వయ్యారంగా పోజులిచ్చిన కీర్తి సురేష్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X