Keerthy Suresh: గ్లామర్ డోస్​ పెంచేసిన మహానటి.. ఇంత హాట్​గా కీర్తి సురేష్​ను చూసి ఉండరు!

మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇక మహానటి సినిమాతో మహానటి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంది. ఇక ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఇప్పటివరకు హోమ్లీగా, క్లాసిక్​ లుక్​లో ఆకట్టుకున్న కీర్తి సురేష్​ ఈ మధ్య కాలంలో కొంచెం గ్లామర్​ డోస్​ పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా స్టైలిష్​ డ్రెస్​లో కీర్తి సురేష్​ ఇచ్చిన పోజులు యూత్ మతి పోగొట్టేల ఉన్నాయి.

తొలి సినిమాతోనే..

తొలి సినిమాతోనే..

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది మలయాళీ బొద్దుగుమ్మ కీర్తి సురేష్​. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేసింది కీర్తి సురేష్​. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ నాగ్ అశ్విన్​ తెరకెక్కించిన మహానటి మూవీతో మహానటి అని పేరు తెచ్చుకుంది.

హోమ్లీగా..

హోమ్లీగా..

ఆ తర్వాత సినిమాల్లో గ్లామర్​కు తావివ్వకుండా సినిమాలు చేస్తూ వచ్చింది కీర్తి సురేష్. అయితే ఆ సినిమాలన్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేవు. రిజల్ట్ ఎలా ఉన్న తను మాత్రం హోమ్లీగా, బబ్లీగానే కనిపిస్తూ వచ్చింది. అంతేకాకుండా మిస్​ ఇండియా, గుడ్​ లక్​ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపింది. ఆ సినిమాలు ఫలితాలు కూడా తారామారు అయ్యాయి.

 కొంచెం గ్లామరస్​గా..

కొంచెం గ్లామరస్​గా..

అలాగే గాంధారి అనే ప్రైవేట్​ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్​. ఇక ఇదంతా కాదని, ఇటీవల సూపర్ స్టార్ మహేశ్​ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్​ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. మంచి కలెక్షన్లు రాబట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ అకౌంట్​లో ఓ హిట్​ ఉండేలా చేసింది.

 డోస్ పెంచిన కీర్తి..

డోస్ పెంచిన కీర్తి..

అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ పోషించిన కళావతి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో ఎన్నడూ చూడని విధంగా కీర్తి సురేష్​ను చూడటంతో కొందరు బాగుందని పొడడగా, మరికొందరు పాత కీర్తి సురేష్​ ముద్దుగా ఉందని భావించారు. ఇక ఇప్పుడు బొద్దుగా ఉన్న కీర్తి సురేష్​ కాస్తా స్లిమ్​ అయి.. గ్లామర్​ డోస్​ పెంచినట్లు తెలుస్తోంది.

 మత్తెక్కేలా చూస్తూ..

మత్తెక్కేలా చూస్తూ..

ఇందుకు తాజాగా కీర్తి సురేష్​ పెట్టిన ఫొటోలే ఉదాహరణ. ఇందులో స్టైలిష్​ వేర్​లో మత్తెక్కేలా చూస్తూ వయ్యారాలు పోయింది కీర్తి సురేష్​. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్​ల కనపించే ఈ వేర్​లో అల్ట్రా గ్లామర్​గా ఆకట్టుకుందు కీర్తి సురేష్. తన హాట్​ లుక్స్​తో యూత్​ మతిపోగొట్టేలా మెస్మరైజ్​ చేసింది ఈ ముద్దుగుమ్మ.

హాట్​నెస్​తో..

హాట్​నెస్​తో..

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తన పదునైనా చూపులతో హాట్​నెస్​తో చూస్తున్న కీర్తి సురేష్​ గురించే నెట్టింట టాక్ నడుస్తోంది. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్​ చిరంజీవి భోళా శంకర్ మూవీలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నానితో దసరా మూవీ సైతం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X