మీ ప్రశ్నలకు నా సమాధానం.. కీర్తి సురేష్ రెడీ అవుతోంది!!
కీర్తి సురేష్ ఈ లాక్ డౌన్‌లో ఎంత సందడి చేసిందో అందరికీ తెలిసిందే. పెంగ్విన్ చిత్రంతో ఓటీటీలో బోణి కొట్టింది. కానీ ఈ చిత్రం అంతగా వర్కవుట్ కాలేదు. సినిమా యావరేజ్ అయినా కీర్తి సురేష్ నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. అసలే కీర్తి సురేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా మిస్ ఇండియా అంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.
ఆ మధ్య రిలీజ్ చేసిన మిస్ ఇండియా ట్రైలర్ బాగానే క్లిక్ అయింది. జగపతి బాబు కీర్తి సురేష్‌కు వార్నింగ్ ఇవ్వడం.. బిజినెస్ అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆటలు కాదు.. అదొక యుద్దం అంటూ కీర్తి సురేష్‌ను హెచ్చరించడం.. బిజినెస్ చేయడానికి పుట్టాను అంటూ దాని కోసం ఏదైనా చేస్తాను అంటూ కీర్తి సురేష్ కౌంటర్ ఇవ్వడం ఇలా ప్రతీ ఒక్క సీన్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా రేపు (నవంబర్ 4) విడుదల కాబోతోంది.

కీర్తి సురేష్ రేపు సినిమా విడుదల కాబోతోందన్న సందర్భంగా అభిమానులతో మాట్లాడేందుకు లైవ్‌లోకి రాబోతోన్నట్టు ప్రకటించింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు అందుబాటులో ఉంటాను.. మీరు ప్రశ్నలు వేయండి.. నేను సమాధానం ఇస్తాను అని ఫ్యాన్స్‌కు ఆఫర్ ఇచ్చింది. మరి అభిమానులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో.. కీర్తి ఎలాంటి సమాధానాలు ఇస్తుందో చూడాలి. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











