కీర్తి సురేష్ కి షాక్.. బాలీవుడ్ మొదటి సినిమాకే అంత దారుణంగా!
ఏ హీరోయిన్ కి మాత్రం తమ మార్కెట్ ని మరింత స్థాయిలో పెంచుకోవాలని ఉండదు చెప్పండి. మరి అలానే చాలా మంది యువ హీరోయిన్స్ తమ కెరీర్లో అన్ని రకాలా రుచులు అందించేందుకు ప్రయత్నం చేస్తారు. కాగా ఇది అన్ని సినీ వర్గాల్లో కూడా కనిపిస్తుంది. నార్త్ నుంచి ఉన్న హీరోయిన్స్ సౌత్ కి రావాలని చూస్తే సౌత్ నుంచి ఉన్న హీరోయిన్స్ నార్త్ లో పాగా వెయ్యాలని కోరుకుంటారు.
మరి అలాంటి హీరోయిన్స్ లో సౌత్ నుంచి కొందరు ఆల్రెడీ హిందీలో సెటిల్ అయ్యిపోయారు కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం హిందీలో సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని సిద్ధం అయ్యింది. కాగా ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు తెలుగు తమిళ్ లో బాగా తెలిసిన హీరోయిన్ కీర్తి సురేష్ నే.. కాగా కీర్తి ఇపుడు వరకు ఎన్నో సినిమాల్లో ఆమె లుక్స్ పరంగా మంచి ట్రీట్ ఇచ్చింది.

అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఆమె సినిమాల్లో చాలా హోమ్లీగా కనిపించింది. అయితే అప్పట్లో ఎలాంటి స్కిన్ షో చెయ్యని కీర్తీ ఇపుడు బోల్డ్ షో ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికపుడు హైలైట్ అవుతుంది. కాగా ఇవన్నీ కీర్తి బాలీవుడ్ ఎంట్రీ కోసమే అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు కానీ ఈమెకు ఇదే బాలీవుడ్ ఎంట్రీ షాకిచ్చేలా ఉందని టాక్ మొదలైంది.
కీర్తి హిందీలో "బేబీ జాన్" అనే సినిమాతో హిందీలో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా హిందీలో విజయ్ దళపతి నటిస్తే సమంత తన సరసన హీరోయిన్ గా నటించింది. మరి సామ్ కీర్తి చేస్తుండగా విజయ్ పాత్రని బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించాడు. అయితే ఇన్ని రోజులు కీర్తి పై ఎలాంటి లుక్స్ లాంటివి సినిమా నుంచి రాలేదు కానీ లేటెస్ట్ గా వచ్చిన టెస్టర్ కట్ లో రివీల్ అయ్యింది.
అయితే ఇందులో ఈమె లుక్ చూసి తెలుగు సహా హిందీ ఆడియెన్స్ కూడా షాకయ్యారు. కొంతమంది అయితే సినిమా హీరోయిన్ ఎవరో తెలీని వారు ఈమె లుక్ చూసి బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీని చూసినట్టు అనిపించింది అని అంటున్నారు. మరి ఒక హీరోయిన్ కి ఆమె గుర్తింపు కాకుండా మరో హీరోయిన్ లా అనిపించడం అంటే ఒకింత అవమానమే అనుకోవాలి.
అలాగే ఇంకొందరు అయితే బాలీవుడ్ నటి వామిక గబ్బి అని కూడా అంటున్నారు. ఇలా ఒకపుడు మహానటి సావిత్రి గార్ని రిప్రెజెంట్ చేసిన కీర్తి ఇపుడు ఆమె లుక్ కే ఒక ప్రత్యేక గుర్తింపు లేని విధంగా మారిపోవడం అనేది తన డౌన్ ఫాల్ అనుకోవాలా? ఇప్పటికే సరైన హిట్స్ ఈమెకి లేవు అందులోని లుక్ పరంగా ఇలాంటి ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్ నుంచి అందుకోవడం అనేది కొంచెం ఆమె ఫ్యాన్స్ కి బాధాకరమే అని చెప్పొచ్చు.
మరి ఈ భారీ సినిమాకి ఒరిజినల్ దర్శకుడు అట్లీ నిర్మాణం వహిస్తున్నాడు. మరి ఈ డిసెంబర్ లో రాబోతున్న సినిమా హిందీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో మెయిన్ గా హిందీ ఎంట్రీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న కీర్తి సురేష్ కి ఎలాంటి వెల్కమ్ దక్కుతుందో అనేది చూడాలి.
After sanjayduttification of Ranbir Kapoor, bollywood turned #KeerthySuresh into Kiara Advani in #BabyJohn. pic.twitter.com/RRopJxdmPu
— MovieBlast (@movie_blast) November 5, 2024
I was convinced that #BabyJohn starred #KiaraAdvani until I saw the credits showing #KeerthySuresh as the lead. I even searched through the teaser at 0.25x speed, focusing on Wamiqa Gabbi’s short appearance, still thinking the SS below as Kiara. Only later did I realize it was… pic.twitter.com/lyMkYiiyEt
— Siva Mohan (@filmmakerof20s) November 5, 2024


Click it and Unblock the Notifications











