కీర్తి సురేష్ ప్రేమ వివాహంపై క్లారిటీ: ఆమె దృష్టంతా దాని మీదే అంటూ స్పష్టం చేసిన హీరోయిన్ మదర్
మిగిలిన వాటితో పోలిస్తే సినిమా రంగంలోని సెలెబ్రిటీల ప్రేమ వ్యవహారాలపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే తరచూ ఎవరో ఒక నటుడో.. నటి గురించో ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అందులో నిజముందా లేదా అని చూడకుండానే జనాలందరూ ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. ఇలా.. ఇటీవలి కాలంలో బాగా హాట్ టాపిక్ అయిన వ్యవహారాల్లో టాలీవుడ్ హీరోయిన్ 'మహానటి' కీర్తి సురేష్.. అనిరుథ్ రవిచందర్ ప్రేమాయణం ఒకటి. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా ఎంట్రీ.. దేశ వ్యాప్తంగా గుర్తింపు
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన కీర్తి సురేష్.. 'ఇదు ఎన్నా మాయం' అనే సినిమాతో తమిళంలో.. 'నేను శైలజ'తో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. ఇవి సూపర్ హిట్ అవడంతో పాటు ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ వెంటనే తెలుగులో నాని, పవన్, నాగార్జున సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.

అప్పటి నుంచి మారిన కెరీర్.. బిజీగా
కీర్తి సురేష్ కెరీర్‌లో 'మహానటి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఇందులో కీర్తి చేసిన నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ఆమెకు జాతీయ అవార్డు సైతం దక్కింది. తద్వారా వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోందీ భామ.

అప్పుడు అతడితో డేటింగ్ చేస్తుందని
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్.. తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓ వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయినప్పటికీ అటు కీర్తి సురేష్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ దీనిపై స్పందించలేదు. దీంతో ఆమె పెళ్లి జరిగేది నిజమేనన్న టాక్ వినిపించింది.

ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఇలా
ప్రస్తుతం మహేశ్ బాబుతో 'సర్కారు వారి పాట' సహా కొన్ని సినిమాలతో ఫుల్ బిజీగా గడపుతోంది కీర్తి సురేష్. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాదిలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన అనిరుథ్ రామచందర్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కూడా దేశ వ్యాప్తంగా వార్తలు వెలువడ్డాయి.

కీర్తి సురేష్ ప్రేమ వివాహంపై ఫుల్ క్లారిటీ
గత ఏడాది అక్టోబర్‌లో 16న అనిరుథ్ పుట్టినరోజు జరిగింది.. తర్వాతి రోజే అంటే అక్టోబర్ 17న కీర్తి సురేష్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి అర్ధరాత్రి సమయంలో జంటగా కేక్ కట్ చేశారు. ఆ సమయంలో వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ జంట ప్రేమలో ఉందని ప్రచారం చేశారు. దీంతో ఇది చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది.

ఆమె దృష్టంతా దాని మీదే అంటూ స్పష్టం
కీర్తి సురేష్ లవ్ గురించి తాజాగా ఆమె మదర్ మేకన స్పందించారు. ఓ మలయాళ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. 'మా అమ్మాయి ఎవరితోనూ ప్రేమలో లేదు. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదే ఉంది. మాకు కూడా ఆమెకు అప్పుడే పెళ్లి చేయాలన్న ఆలోచన లేదు. దయచేసి కీర్తిపై వస్తున్న పుకార్లను నమ్మవద్దు' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడినట్లైంది.


Click it and Unblock the Notifications











