కీర్తి సురేష్ సంపాదన ఎన్ని కోట్లో తెలుసా? రెమ్యునరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే

అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో కీర్తి సురేష్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకొన్నారడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె నటనపై సినీ విమర్శలకే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురిసాయి. మహానటి తర్వాత కీర్తీ సురేష్ కెరీర్ గ్రాఫ్ రివ్వును ఎగిరింది. ఆఫర్లు వెల్లువెత్తినా సరైన చిత్రాలను ఎంపిక చేసుకొంటూ జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. తాజాగా ఆమె నటించిన పెంగ్విన్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత సంపద, రెమ్యూనరేషన్ వివరాలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh
 అమెజాన్‌లో కీర్తీ సురేష్ పెంగ్విన్

అమెజాన్‌లో కీర్తీ సురేష్ పెంగ్విన్

లాక్‌డౌన్ కారణంగా భారతీయ సినిమా పరిశ్రమ పరిస్థితి గందరగోళంగా తయారైంది. పూర్తయిన చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేక.. షూటింగు మధ్యలో ఆగిపోయిన సినిమాలు పూర్తి చేసుకోలేని పరిస్థితి నిర్మాతలకు దిగ్బ్రాంతిని కలిగిస్తున్నది. ఈ క్రమంలో పలు నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా జ్యోతిక నటించిన పోనుమగల్ వాంధల్, అమితాబ్ నటించిన గులాబో సితాబో చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాయి. ఇక కీర్తీ సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం కూడా అదే దారిని ఎంచుకొన్నది.

 జూన్ 19న పెంగ్విన్ రిలీజ్

జూన్ 19న పెంగ్విన్ రిలీజ్

కరోనా పరిస్థితుల కారణంగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో నిర్మాతలు తమ చిత్రాన్ని అమెజాన్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఈ చిత్రం జూన్ 19వ తేదీన అమెజాన్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో కీర్తీ సురేష్ రెమ్యూనరేషన్, ఆమె ఇప్పటికి వరకు ఎంత సంపాదించారనే విషయం మీడియాలో ఆసక్తిగా మారింది.

కీర్తీ సురేష్ విలాసవంతమైన కార్ల గురించి

కీర్తీ సురేష్ విలాసవంతమైన కార్ల గురించి


కీర్తి సురేష్‌కు విలాసవంతమైన కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద ఉన్న అతి ఖరీదైన కారు జాగ్వర్ ఎక్స్ జే, దాని ఖరీదు రూ.1.03 కోట్లు. ఈ కారు మాత్రమే కాకుండా కీర్తి సురేష్ వద్ద ఫోర్ట్ మోడల్, స్కోడా, మెర్సిడెజ్ బెంజ్, ఆడి కారు ఉన్నాయి. ఇక చెన్నై, కేరళలో కొన్ని ఖరీదైన భవనాలు ఆమె పేరిట ఉన్నట్టు సమాచారం.

కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతంటే

కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతంటే

ఇక దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కీర్తీ సురేష్ చేతిలో భారీ, క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. మలయాళంలో మరక్కర్, తెలుగులో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రంగ్ దే, తమిళంలో అన్నాతే చిత్రంలో నటిస్తున్నారు. ఇక ప్రతీ సినిమాకు సుమారుగా రూ.కోటి పారితోషికం అందుకొంటున్నట్టు సమాచారం.

 కీర్తీ సురేష్ మొత్తం సంపద

కీర్తీ సురేష్ మొత్తం సంపద

2000లో పైలెట్ చిత్రం ద్వారా బాలనటిగా సినీ కెరీర్ ఆరంభించిన కీర్తి సురేష్ గత 20 ఏళ్ల కెరీర్‌లో వ్యక్తిగతం సంపాదించిన ఆస్తి భారీగానే ఉందనే విషయం ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 30 సినిమాల్లో నటించారు. ఈ కాలంలో ఆమె వ్యక్తిగత సంపద 2020 నాటికి 2 మిలియన్ల డాలర్లు అంటే అక్షరాల రూ.15 కోట్లుగా అంచనా వేశారు.

 కీర్తీ సురేష్ వ్యక్తిగత జీవితం

కీర్తీ సురేష్ వ్యక్తిగత జీవితం

కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలయాళంలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత సురేష్ కుమార్, తమిళ నటి మేనక కుమార్తెగా కీర్తి సుపరిచితులు. తన తండ్రి నిర్మాతగా వహించిన చిత్రం ద్వారానే బాలనటిగా కెరీర్ ఆరంభించారు. కీర్తీ సురేష్ తండ్రి ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పెళ్లి అనే వార్తలను కీర్తి కుటుంబం ఖండించింది.

కీర్తీ సురేష్ కెరీర్

కీర్తీ సురేష్ కెరీర్


ఇక దక్షిణాదిలో జోరు కొనసాగిస్తున్న కీర్తీ సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకొన్నది. అజయ్ దేవగన్ నటిస్తున్న మైదాన్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇలా తెలుగు, తమిళ, మలయాళంతోపాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X