మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్!
మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అందరిని మెస్మరైజ్ చేసింది కీర్తి సురేష్. అంతకుముందే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ మహానటి చిత్రంలో నటనలో మరో స్థాయికి చేరుకుంది. గత ఏడాది విడుదలైన ఉత్తమ చిత్రాలలో మహానటి ఒకటిగా నిలిచింది. గత ఏడాది కీర్తి సురేష్ సర్కార్, పందెం కోడి 2 లాంటి కమర్షియల్ చిత్రాల్లో కూడా మెరిసింది.
తాజాగా కీర్తి సురేష్ మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సినిమా కూడా నేడు లాంఛనంగా ప్రారంభం అయింది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ లో మహేష్ కోనేరు నిర్మాతగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ మరో అద్భుతమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

డెబ్యూ దర్శకుడు నాగేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం మహేష్ కోనేరు కళ్యాణ్ రామ్ నటిస్తున్న 8అనే చిత్రాన్ని చిత్రం నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications











