Don't Miss!
- News
వైఎస్ వివేకా హత్య కేసులో మున్ముందు అనూహ్య పరిణామాలు?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
కీర్తి సురేష్ మరో కొత్త లుక్.. కుక్కతో సెల్ఫీ దిగుతూ..
టాలీవుడ్ మహానటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. సావిత్రి బయోపిక్ ద్వారా జీవితానికి సరిపడే క్రేజ్ అందుకున్న ఈ క్యూట్ గర్ల్ కాలం మారుతున్న కొద్దీ తన అందంతో కూడా మార్పులు తెస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన పెంపుడు కుక్కతో ఫొటోలు దిగుతూ సరదాగా గడుపుతున్నట్లు చెబుతోంది.

మహానటి సినిమా అనంతరం కీర్తి సురేష్ చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా కూడా తనకు ఇష్టం లేని పాత్రలు ఎంత మాత్రం చేయనని చెబుతోంది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉండి సినిమాలో పాత్ర కీలకమైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని అంటోంది. ఇక గ్లామర్ డోస్ ఎక్కువైనా కూడా ఈ బ్యూటీ ఏ మాత్రం ఒప్పుకోదట. ఇటీవల బికినీ లిప్ లాక్ లపై కూడా అమ్మడు షాకింగ్ కామెంట్స్ చేసింది.

బికినీలో కనిపించడం లిప్ లాక్ సీన్స్ చేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని తన అభిమానులు కూడా అలాంటి పాత్రల్లో నన్ను చూడాలని అనుకోవడం లేదని కీర్తి సురేష్ ఇటీవల క్లారటీ అయితే ఇచ్చింది. ఇక నితిన్ బాలీవుడ్ హిట్ రీమేక్ అందాదున్ లో నటించే అవకాశం వస్తే..అందులో బోల్డ్ సీన్స్ లిప్ లాక్ సీన్స్ చేయాల్సి వస్తుందని మహానటి రిజెక్ట్ చేసిందట. ఇక నెక్స్ట్ సినిమాల కోసం ఈ బ్యూటీ కాస్త సన్నబడుతున్నట్లు తెలుస్తోంది.