బాయ్ ఫ్రెండ్ తో పెళ్ళిపై కీర్తి సురేష్ రియాక్షన్.. బుల్లితెర మహా నటి ఏం చెప్పిందంటే

సౌత్ సినిమా ఇండస్ట్రీ దగ్గర కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలోనే చాలా మంది యువ హీరోయిన్స్ కి మంచి ఫేమ్ వచ్చేయడం దాదాపు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఫేమ్ ని కాపాడుకొని నిలదొక్కుకోవడం లోనే ఆ హీరోయిన్స్ తాలూకా ప్రత్యేకత దాగి ఉంటుంది. కాగా ఇలా సినిమాలోకి వచ్చి సాలిడ్ ఎంట్రీ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిన కొద్ది మంది హీరోయిన్స్ లో తమిళ టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా ఒకామె అని చెప్పాలి.

తెలుగులో "నేను శైలజ" తో హోమ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ నటి తన బ్యాంగర్ వెల్కమ్ ని టాలీవుడ్ లో అందుకొని ఇప్పుడు మాస్ హీరోయిన్ గా కూడా మారింది. కాగా ఇప్పుడు ఒక్క సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లోకి కూడా ఎంట్రీ ఇస్తూ అనేక సినిమాల్లో బిజీగా ఉంది. మరి అందరి యువ హీరోయిన్స్ లానే కీర్తి సురేష్ కి కూడా తన పెళ్ళెప్పుడు అనే కామన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతూ వస్తూనే ఉంది.

keerthy suresh opens on her marriage latest news

ఆ మధ్య అయితే తన క్లోజ్ సర్కిల్ సంబంధించి ఆమె స్నేహితుడినే పెళ్లి చేసుకుంటుంది అన్నట్టుగా కూడా రూమర్స్ వచ్చాయి. కాగా ఇప్పుడు కూడా మరోసారి ఈ తరహా ప్రశ్నలు కీర్తికిఎదురయ్యాయి. ఆమె తమిళ్ లో నటించిన ఓ తాజా సినిమా ప్రమోషన్స్ లో అక్కడ ఫుల్ బిజీగా ఉంది. ఇలా జరిపిన ఇంటరాక్షన్ లో తన స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్నాను అని వస్తున్నా వార్తలపై స్పందించింది.

ఆమె మాట్లాడుతూ జెనరల్ గా తనపై విమర్శలు కానీ సినిమాల పరంగా తన వర్క్ పై కామెంట్స్ ని తప్పకుండా తీసుకుంటాను, కానీ నా పర్శనల్ లైఫ్ కి కానీ నా తల్లిదండ్రుల విషయంలో కానీ ఏమన్నా రూమర్స్ వస్తే వాటిని ససేమిరా పట్టించుకోనని తేల్చేసింది. అలాగే పెళ్లి రూమర్స్ కూడా జస్ట్ రూమర్స్ మాత్రమే కాబట్టి అలాంటివి పట్టించుకోనని తేల్చేసింది.

keerthy suresh opens on her marriage latest news

దీనితో ప్రొఫిషనల్ గా ఎంతవరకు అయినా విమర్శించినా వాటిని పట్టించుకుంటాను కానీ పర్శనల్ గా మాత్రం ఏమన్నా చేస్తే మాత్రం సందేహం లేకుండా వాటిని ఇగ్నోర్ చేసేస్తా అని క్లారిటీ ఇచ్చేసింది. సో కీర్తి సైడ్ నుంచి ఆమె తన పెళ్లి కోసం చెబితే తప్ప రూమర్స్ ని పట్టించుకోనవసరం లేదని చెప్పొచ్చు. కాగా ఇపుడు కీర్తి తెలుగు సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు చేస్తుండగా ఆమె మాత్రం తన బాలీవుడ్ ఎంట్రీ "బేబీ జాన్" పట్ల మాత్రం ఎక్కువ ఆసక్తిగా కనిపిస్తుంది.

అలాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ నెవర్ బిఫోర్ లెవెల్ బోల్డ్ షో చూపించబోతుంది అని బాలీవుడ్ సర్కిల్స్ వార్తలున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా ఈ చిత్రం తమిళ సినిమా విజయ్ నటించిన "తేరి" కి రీమేక్ గా అట్లీ నిర్మాణంలో తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X