ఆ విషయంలో కంట్రోల్ కష్టమే.. ఎవరి మాటలను పట్టించుకోను..

Keerthy Suresh: నేషనల్ అవార్డు విజేత, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయం కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఆమె జీవితం ఎంత సింపుల్‌గా ఉంటుందో చాలా మందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్, ఆహారం, ఆరోగ్యం, లుక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేష్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం గమనించవచ్చు. ప్రారంభ రోజుల్లో ఆమె అచ్చతెలుగు అమ్మాయిలా బొద్దుగా, ముద్దుగా కనిపించేది. ఆమె ఆ లుక్‌కి ఎంతో మంది పడిపోయారు. కానీ, రానురాను కీర్తి బాడీ, ఫిట్‌నెస్‌లో, లుక్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆమె నాజుకైన ఫిజిక్‌‌, స్లిమ్ లుక్‌, స్కిన్ గ్లో ఇలా చాలా మార్పులు వచ్చాయి. ఇవన్నీ సహజంగా వచ్చినవి కాదు. ఇందు కోసం ఎంతగానో శ్రమించిందట. క్రమశిక్షణ, కఠిన వ్యాయామాల ఫలితమేనంట.

Keerthy Suresh Opens Up About Food Fitness and the Secret Behind Her Transformation

హీరోయిన్ కీర్తి సురేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లుక్, ఫిజిక్, ఫిట్‌నెస్ గురించి, ఆ సీక్రెట్స్ గురించి వెల్లడించారు. కీర్తి ముందుగా తన పుడ్ గురించి చెప్పింది. 'నేను అప్పట్లో రోజుకు 10 దోశలు లేదా 10 ఇడ్లీలు తినేదాన్ని. తినడమంటే నాకు హ్యాపీ, ఆ విషయంలో కంట్రోల్ కష్టమే, ఎవరి మాటలను పట్టించుకోను' అని ఓపెన్ గా చెప్పింది. కీర్తి సురేష్ కేరిర్ ప్రారంభంలో చబ్బీగా, క్యూట్‌గా, నేచురల్ లుక్ తో తెరపై కనిపించింది. ఆ లుక్ ఆమెకు గర్ల్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ ను తెచ్చింది. కానీ, కాలక్రమంలో ముఖ్యంగా 'మహానటి' తర్వాత, కీర్తి తన పుడ్, ఫిట్నెస్, హెల్త్ విషయంలో తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టిందట.

కీర్తి సురేష్ లుక్‌లో వచ్చిన మార్పుపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. కొందరు 'పాత లుక్ బావుంది' అని అన్నా, మరోవైపు "ఇప్పటి కీర్తి క్యూట్ గా, షార్ప్‌గా, ఫ్రెష్‌గా ఉంది" అని మరికొందరు పొగిడారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కీర్తి స్పందిస్తూ.. 'బొద్దుగా ఉన్నప్పుడు బాగున్నావని ఇప్పటికీ కొందరు చెప్తారు' అని చెప్పింది. కానీ తాను తినే తిండిని తగ్గించి అలా మారలేదని స్పష్టం చేసింది. "నాకు ఫుడ్ మీద లిమిట్ లేదు. నేను ఇప్పటికీ తింటాను. తిండి ఆపడం నాకు సూట్ అవ్వదు" అని చెబుతూ.. తన ట్రాన్స్‌ఫర్మేషన్ రహస్యాన్ని బయటపెట్టింది.

తాను నిరంతరం వర్కౌట్, ఫిజికల్ డిసిప్లిన్ తో ఉంటాననీ చెప్పింది. తనలో మార్పు ఒక్క డైట్ వల్ల మాత్రమే కాదనీ, మహానటి తర్వాత జిమ్‌పై, వ్యాయామాలపై దృష్టి పెట్టానని చెప్పింది. కార్డియో, స్ట్రెచింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవి అన్నింటిని క్రమం తప్పకుండా కొనసాగించిందట. " అలా 10-12 నెలల్లోనే సుమారు 10 కిలోలు తగ్గాను" అనడం ఆమె శ్రమ ఎంత ఉందో తెలుపుతోంది. తాను ఇష్టపడే తిండిని మానకుండా, ఆరోగ్యానికి సరిపోయేలా బ్యాలెన్స్ డైట్ మెన్ టైన్ చేస్తున్నట్టు తెలిపింది.

ఇక ఆమె బ్యూటీ రొటీన్ విషయానికి వస్తే.. కీర్తి చెప్పిన విషయం మరింత ఆశ్చర్యం కలిగించింది. "నేను స్కిన్‌కేర్‌ను కేవలం నాలుగేళ్ల క్రితమే మొదలుపెట్టాను. అంతకు ముందు షూట్‌కి మేకప్ వేసుకుని తిరిగి వాష్ చేసేదాన్ని అంతే" అని చెప్పింది.

More from Filmibeat

Read more about: keerthy suresh mahanati tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X