అలా చేసే దమ్ముందా? కన్నుకొట్టి రెచ్చగొట్టా.. ప్రియుడితో కీర్తి సురేష్ చిలిపిచేష్టలు
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'నేను లోకల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి, అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. దాదాపు అన్ని స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మహానటి, దసరా వంటి సినిమాలతో తన రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. నేషనల్ అవార్డ్ విన్నర్‌గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్, ఇప్పుడు తన నటనతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన తొలిప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే... తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట వేకేషన్స్, ఫ్యామిలీ టైమ్‌తో ఎంతో అన్యోన్యంగా గడుపుతోంది. అలాగే తన ఫ్యాన్స్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తుంది. యాక్టివ్‌గా ఉంటూ తన లైఫ్‌లోని బ్యూటీపుల్ మూమెంట్స్‌ను షేర్ చేస్తోంది కీర్తి.

ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన ప్రేమ కథను తొలిసారి చాలా ఓపెన్‌గా చెప్పింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కీర్తి మాత్రం చాలా నేచురల్‌గా, చిలిపిగా తన ప్రేమ ప్రయాణాన్ని వివరించింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తన తొలి ప్రేమ గురించి మాట్లాడుతూ కీర్తి సురేష్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 'ఒకసారి నేను నా ఫ్యామిలీతో ఉన్నాను. అతన్ని నేరుగా కలవడం కుదరలేదు. అప్పుడు కన్ను కొట్టి వెళ్లిపోయాను" అంటూ నవ్వుతూ చెప్పింది. ఆ చిన్న సిగ్నల్‌తోనే తన మనసులోని భావన అతనికి అర్థమైందని పేర్కొంది. అలాగే.. తానే ధైర్యం చేసి ఓ ముందడుగు వేసిననీ, తనే అతనితో ముందు మాట్లాడానని కీర్తి సురేష్ వెల్లడించింది.
అంతటితో ఆగకుండా, 'తర్వాత అతనితో గట్స్ ఉంటే నాకు ప్రపోజ్ చెయ్ అని చెప్పాను" అంటూ తన చిలిపి పనులను గుర్తు చేసుకుంది. హీరోయిన్లు సాధారణంగా ఇలాంటి విషయాలపై మౌనం పాటిస్తుంటే.. కీర్తి మాత్రం ధైర్యంగా, సరదాగా చెప్పడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ ప్రేమ కథకు చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందని కీర్తి తెలిపింది.'అతను నాకు మొదటిసారి 2010లో ప్రపోజ్ చేశాడు. కానీ 2016లోనే మా రిలేషన్ నిజంగా సీరియస్ అయింది' అని చెప్పింది. అంటే, దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఈ బంధం ఓపికతో ఉన్నట్టు చెప్పింది. అలాగే.. తమ ప్రేమకు గుర్తుగా ఒక స్పెషల్ విషయం కూడా ఉందని కీర్తి సురేష్ వెల్లడించింది.
'ఆంటోని నాకు ఒక ప్రామిస్ రింగ్ ఇచ్చాడు. పెళ్లి అయ్యే వరకు నేను దాన్ని ఎప్పుడూ తీయలేదు. మీరు గమనిస్తే, నా సినిమాలన్నింటిలోనూ ఆ రింగ్ కనిపిస్తుంది" అని చెప్పింది. ఈ కామెంట్ తర్వాత అభిమానులు ఆమె పాత సినిమాల్లో ఆ రింగ్ కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి కీర్తి సురేష్ చెప్పిన ఈ చిలిపి, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అభిమానులు మాత్రం 'ఇంత అందమైన ప్రేమ కథను ఇంతకాలం దాచారా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











