కీర్తి సురేష్‌పై మళ్లీ రూమర్లు.. ఆ హీరోతో అంటూ మరో విధంగా.. సోషల్ మీడియాలో వైరల్
మహానటితో ప్రతిభావంతురాలైన నటిగా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకొన్న హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఇటీవల కాలంలో పలు రూమర్లు వెంటాడుతున్నాయి. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. తాజాగా మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఆ వార్తలపై యూనిట్ స్పందిస్తూ..

మహానటి చిత్రం తర్వాత
మహనటి చిత్రం తర్వాత బరువైన పాత్రలతో కీర్తి సురేష్ తన కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. సర్కార్, మిస్ ఇండియా లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

పొన్నియన్ సెల్వన్ చిత్రంలో
అయితే పలువురు అగ్రహీరోలతో జత కట్టిన కీర్తీ సురేష్ పొన్నియన్ సెల్వన్ చిత్రంలో జయం రవికి చెల్లులుగా నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ రాజవంశానికి చెందిన యువతిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అరుల్ మోజీ వర్మన్ అనే రాజుకు సోదరిగా కుందవై పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన కీర్తి పోస్టర్ మీడియాలో వైరల్‌గా మారింది.

యువరాణి వేషంలో కీర్తీ సురేష్
సోషల్ మీడియాలో కీర్తీ సురేష్‌కు సంబంధించిన పోస్టర్ వైరల్‌గా మారడంతో పొన్నియన్ సెల్వన్ మూవీ యూనిట్ స్పందించింది. యువరాణి వేషంలో ఉన్న కీర్తీ సురేష్ ఫోటోకు సినిమాకు సంబంధం లేదు. మీడియాలో వస్తున్న కథనాలకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకొన్నాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది

కీర్తీ సురేష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్
కీర్తీ సురేష్‌కు సంబంధించిన పోస్టర్ అనేక రకాలు కన్‌ఫ్యూజ్ చేస్తున్నది. అయితే అది సినిమాకు సంబంధించింది కాదు. ఎవరో సృష్టించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ల్ అది. కాబట్టి ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న పోస్టర్ కేవలం ఊహజనితమే. అది పొన్నియన్ సెల్వన్‌కు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కాదు అని టీమ్ పిక్సెల్ డ్రా మీడియా ఓ ప్రకటనలో తెలిపింది.
Recommended Video

మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిషా, కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, ప్రభు, జయరాం, శరత్ కుమార్, పార్తీపన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











