ఇలా పెళ్లి చేసుకొని అలా కీర్తి సురేష్ హాట్ షో.. మంగళ సూత్రంతోనే ఓ రేంజ్‌లో
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో మెయిన్‌గా మన తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న హీరోయిన్స్‌లో నాచురల్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా ఒకామె అని చెప్పాలి. కీర్తి సురేష్ తెలుగులో అందుకున్న హిట్ తో పాటుగా కొంచెం చబ్బీగా ఉంటుందనే కామెంట్స్ కూడా అందుకుంది. అలా అక్కడి నుంచి తెలుగులో వరుస సినిమాలు, వరుస హిట్స్ తో బిజీగా మారి మళ్ళీ తన నేటివ్ ఇండస్ట్రీ తమిళ్ లోనూ పలు సినిమాలు చేస్తూ వచ్చింది.
అక్కడ కూడా వరుస హిట్స్ అందుకున్న కీర్తి సడెన్‌గా సన్నగా మారి షాకిచ్చింది అని చెప్పాలి. నాటి నుంచి అదే లుక్ లో కంటిన్యూ అయ్యిన కీర్తి సురేష్ ఇపుడు ఒక సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఆల్రెడీ తెలుగు, తమిళ్‌లో నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. తాను హీరోయిన్ గా చేసినవి, సోలోగా చేస్తున్నవి కూడా హిట్ కాకపోవడంతో ఈమె ఇక హిందీలో ఎంట్రీ ఇచ్చింది.

హిందీలో స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా బేబీ జాన్ అనే సినిమాతో కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈమె నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో కీర్తి జోరుగా పాల్గొంటుంది. కాగా ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఇంకా ఆమె లుక్ లాంటివి ఏవి రాకుండానే కీర్తి సురేష్.. ఏ సినిమాకి లేని విధంగా ఈ సినిమాలో బోల్డ్ షో చూపిస్తుంది అని టాక్ వచ్చింది.
అప్పటి వరకు హోమ్లీ గానే కనిపించిన కీర్తిపై బాలీవుడ్ ప్రభావం గట్టిగానే పడిందని ఆమె నుంచి వచ్చిన పలు ఫోటో షూట్‌లు పలు ఆఫ్ లైన్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హీటకెక్కించాయి. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ నుంచి ఊహించని విధంగా తన పెళ్లి అనౌన్సమెంట్ లు అలాగే ప్రేమను కూడా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చింది.
ఇలా అనౌన్స్ చేసిన కొద్దిరోజులకే తన ప్రియుడు ఆంటోనీ తట్టిని రెండు పెళ్లిళ్లు చేసుకుంది. దీనితో మరోసారి కీర్తి సురేష్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇలా పెళ్ళైందో లేదో వెంటనే మళ్ళీ కీర్తి సురేష్ తన హాట్ షోతో ఊహించని విధంగా హీటెక్కించింది. ఇక్కడ పెళ్లి చేసుకొని నార్త్ లో తన అందాలు చూపిస్తూ మంగళసూత్రంతో కనిపించి అందరికీ షాకిచ్చింది.
దీనితో తన హాట్ విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో మరోసారి అటెన్షన్ తీసుకున్నాయి. ఇక ఈమె నటించిన ఈ అవైటెడ్ యాక్షన్ చిత్రం ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్‌కి రాబోతోంది. తమిళ హిట్ చిత్రం 'తేరి' కి హిందీలో రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాపైనే కీర్తి సురేష్ అన్ని ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











