కీర్తి సురేష్‌కు అలాంటి సర్జరీ? దిమ్మతిరిగేలా మహానటి రియాక్షన్

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. వరుస హిట్స్ పడితే మూడు, నాలుగేళ్లు నిశ్చింతగా ఉండొచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా దుకాణం సర్దేయాల్సిందే. అందం, ఫిట్‌నెస్ ఉన్నంత వరకు హీరోయిన్లకు ఎలాంటి ఢోకా లేదు. బొద్దుగా మారినా, ఫేస్‌లో ఛార్మింగ్ తగ్గినా అవకాశాలు గల్లంతే. అందుకే తమ అందాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు ముద్దుగుమ్మలు. ఇందుకోసం వెయిట్‌లాస్, వర్కవుట్స్, సైజ్ జీరో డైటింగ్‌లతో పాటు కొందరు సర్జరీలు కూడా చేసుకున్నారు. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కూడా వెయిట్ లాస్ కావడానికి సర్జరీ చేయించుకుందంటూ పుకార్లు వస్తున్నాయి. దాంతో మహానటి స్వయంగా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

తక్కువ కాలంలోనే సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తొలినాళ్లలో ఈమె నటించిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఐరన్ లెగ్ ముద్రను కూడా వేసుకుంది. అయితే మహానటి సావిత్రి బయోపిక్ తర్వాత కీర్తి జీవితం మలుపు తిరిగింది. నాటి నుంచి ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు తెచ్చుకున్న కీర్తి .. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

Keerthy Suresh Reacts To Surgery Rumours Reveals Shocking Weight Loss Journey

గత కొంతకాలంగా కీర్తి సురేష్ వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. భోళా శంకర్, సిరెన్, రఘు తాత, బాబీ జాన్, ఉప్పు కప్పురంబు, రివాల్వర్ రీటా వంటి చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం మలయాళంలో కన్నివిడి, తెలుగులో రౌడీ జనార్థన్‌తో పాటు అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో మూవీ, మలయాళంలో తొట్టం, తమిళ్‌లో సత్యవన్ సావిత్రి, హిందీలో రాఫ్టర్ సినిమాలలో ఆమె నటిస్తున్నారు.

కాగా.. బొద్దుగా, ముద్దుగా కనిపించే కీర్తీ సురేష్ ఇటీవలి కాలంలో బక్కగా ముఖంలో ఛార్మ్ కోల్పోయి కనిపిస్తున్నారు. దాంతో కీర్తికి ఏమైంది? అంటూ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కొందరైతే ఆమె సర్జరీ చేయించుకుందా అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద పోస్ట్ పెట్టారు.

నేను నా ఫిట్‌నెస్ జర్నీ గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అదే నాకు అతిపెద్ద గురువు. ప్రతిరోజూ నేను నా శరీరం గురించి, నా గురించి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటా. 2013లో నటిగా నా ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఏమీ తెలియని అమ్మాయిని. చాలామంది లాగే జిమ్ అనేది నా కోసం కాదని భావించాను. కానీ నా శరీరానికి నిజంగా అవసరమైన ప్రాథమిక అంశాలను వదిలేశాను. 2018లో మహానటి తర్వాత.. విరామ సమయంలో నేను కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నాను.

హై ప్రోటీన్, తక్కువ కార్బోహైట్రేట్లు ఉన్న ఆహారంతో పాటు హెచ్ఐఐటీ, కార్డియో వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాను. 9 నెలల్లో 10 కిలోలు తగ్గాను. ప్రజలు నన్ను బాగా వీక్‌గా ఉన్నావు అని.. సర్జరీలు చేయించుకున్నావని అనేంతగా కష్టపడ్డాను. నా ఫేస్ విషయంలోనూ నేచురల్‌గానే ఉంటాను. అందుకే ఆ మాట వినగానే నాకు కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే నా కష్టమంతా ఒక కత్తి ఖాతాలోకి వెళ్లిపోయింది.

చివరికి 2020లో నేను యోగా వైపు మళ్లాను.. అది నా జీవితాన్ని మార్చేసి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అంతేకాకుండా నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక మార్గం చూపించింది. కానీ కాలక్రమంలో జిమ్ వల్ల ప్రయోజనం ఉందని దానిని సరైన పద్ధతిలో చేయాలి. ఇప్పుడు నా దినచర్యలో అది ప్రధానమైనది. యోగా, యానిమల్ ఫ్లో, కార్డియో, కాలిస్థెనిక్స్‌తో సమతుల్యం చేసుకుంటాను. ఒకప్పుడు నాకు అస్సలు ఇష్టం లేనిది, ఈరోజు అస్సలు రాజీపడలేని విషయంగా మారింది. ఈరోజు నన్ను నేను ఈ స్థాయిలో చూసుకుంటున్నందుకు గర్వంగా ఉంది.

అయినప్పటికీ ప్రజలు నా దగ్గరికి వచ్చి నేను బొద్దుగా ఉన్నప్పుడే వాళ్లకి బాగా నచ్చానని.. సన్నగా ఉంటే బాలేదని చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో ఆశ్చర్యంగా ఉంది. ఇటీవల శారీరకంగా, మానసికంగా ఒక ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని నెలలుగా నేను అందుబాటులో లేను. కానీ ఈ ప్రయాణం నాకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఏదో ఒక సమయంలో నేను కుంగిపోవాల్సి వచ్చినా, విరామం తీసుకోవాల్సి వచ్చినా జిమ్‌ని మాత్రం అస్సలు వదిలిపెట్టనని కీర్తి సురేష్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కీర్తి సురేష్ డెడికేషన్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more about: keerthy suresh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X