స్టార్ హీరోతో లిప్‌లాక్ మహనటి రెడీ.. హద్దుల గీత దాటిన కీర్తీ సురేష్!
అందాల భామ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన జతకడుతూ అదరగొడుతోంది. ఇంకోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటూ తన సత్తా చూపిస్తుంది.
నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ముద్దుగా బొద్దుగా ఉన్న అమ్మడిని చూసి తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గిటార్లు మోగాయి. ఇక మహానటి సినిమాతో కీర్తి ఆ సావిత్రినే నేలకు దించింది. పెద్దవారిలో సైతం ఆమె దండం పెట్టించుకుంది..అంతలా ఆమె నటనలో లీనమైపోయింది. సావిత్రిగా కీర్తి నటించలేదు.. జీవించింది.

ఇక ఈ సినిమా తరువాత అంతటి హిట్ ను కీర్తి అందుకున్నదే లేదు. అంతేనా బొద్దుగా ఉన్న ఈ భామ బక్కచిక్కి అందాల ఆరబోతకు కూడా సిద్ధమేనని హింట్ ఇస్తుంది. ఇక ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు కానీ, లిప్ లాక్ లకు కానీ కీర్తి నో చెప్పుకుంటూ వస్తున్న విషయం తెల్సిందే. అయితే మొదటిసారి అమ్మడు కూడా గీత దాటి లిప్ కిస్ కు రెడీ అయ్యిందని టాక్ నడుస్తోంది..
వివరాల్లోకి వెళితే బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. అట్లీ తెరకెక్కించిన తేరి సినిమాకు రీమేక్ గా బేబీ జాన్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో కీర్తి - వరుణ్ కు మధ్య డీప్ లిప్ కిస్ ఉండనుందని టాక్. అందుకు కీర్తి కూడా ఒప్పుకుందని అంటున్నారు. గతంలో కీర్తి తాను ఇలాంటివాటిని చేయను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది.

ఇప్పటివరకు ఇలాంటివాటికి నో చెప్పిన కీర్తి...ఒక్కసారిగా బాలీవుడ్ కు వెళ్లిపోవడంతో ఇలా హద్దు మీరుతుందని అంటున్నారు. కీర్తి ఫ్యాన్స్ సైతం తెలుగులో ఎలా ఉండేదానివో ఇప్పుడు అలాగే ఉండు కీర్తి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











