ఆ ప్రేమతో మురిసిపోతోంది.. నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్న కీర్తి సురేష్
కరోనా, లాక్డౌన్ వంటి వాటితో గతేడాది అందరూ కూడా నాలుగు గోడల మధ్య బతకాల్సి వచ్చింది. ఎంతటి స్టార్ అయినా కూడా ఇంటి గడప దాటి బయటకు వచ్చే చాన్స్ లేకపోయింది. ఓ ఏడెనిమిది నెలలు అందరూ ఇంటిపట్టునే ఉన్నారు. అలా ఇంట్లోనే ఉండటంతో కొందరు బాగానే ఎంజాయ్ చేశారు.. ఇంకొందరు ఆ సమయాన్ని వినియోగించుకుంటూ కొత్త విషయాలు నేర్చుకున్నారు. మరకొంత మంది కొన్ని బాధలు పడ్డారు.
అయితే కీర్తి సురేష్ మాత్రం లాక్డౌన్‌ను ఇంటిసభ్యులతో కలిసి ఎంచక్కా గడిపేసింది. అసలే కీర్తి సురేష్‌కు ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. అందులోనూ అమ్మతో సమయాన్ని గడపడం అంటే మరింత మక్కువ. అలా అమ్మ మేనకతో లాక్డౌన్ మెమోరీస్‌ను ఇప్పుడు కీర్తి గుర్తుకు చేసుకుంటోంది. సహజంగా అమ్మాయిలకు గోరింటాకు అంటే ఇష్టం ఉంటుంది. అలాగే కీర్తి సురేష్‌కి కూడా ఇష్టమున్నట్టుంది.

అలా కీర్తి సురేష్ తన అమ్మ చేత్తో గోరింటాకు పెట్టించుకుంది. ఇక తల్లి ప్రేమ గురించి కీర్తి సురేష్ చెబుతూ.. ఎంతో పవిత్రమైన ప్రేమ అంటూ తల్లి మేనకా సురేష్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో కూతురు కీర్తితో ఏదో ముచ్చట్లు పెడుతూ.. చేతికి గోరింటాకు పెడుతోంది మేనకా సురేష్. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కోసం అక్కడికి చెక్కేసింది.


Click it and Unblock the Notifications











