కల్కి 2898 AD కోసం నాగ్ ఆశ్విన్ భారీ ఆఫర్.. ప్రభాస్ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ ఏడాదిలో వచ్చిన తెలుగు రీసౌండింగ్ పాన్ ఇండియా హిట్స్ లో ఇండియన్ సినిమా దగ్గరే ఒక క్రేజీయెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం "కల్కి 2898 ఎడి" కూడా ఒకటి. మరి మన టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ అటు హిందీ సినిమా నుంచి స్టార్ నటీనటులు అమితాబ్, దీపికా పదుకోన్ అలాగే దిశా పటాని, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్స్ ని హ్యాండిల్ చేసిన విధానం నుంచి తమిళ్ నుంచి కమల్ హాసన్ అలాగే పశుపతి లాంటి నటుల్ని పర్ఫెక్ట్ పాత్రల్లో ప్రెజెంట్ చేయడం కానీ..
మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్, ఇక మన తెలుగు నుంచి అయితే మెయిన్ హీరో ప్రభాస్ నుంచి జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, మాళవిక నాయర్, వరకు నటీనటుల పరంగా ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ గా కల్కి 2898 ఎడి ని తాను డిజైన్ చేసి మంచి మార్కులు కొట్టేసాడు. ఇక ఒక్క కాస్టింగ్ పరంగా మాత్రమే కాకుండా కంటెంట్ పరంగా కూడా నాగ్ అశ్విన్ గట్టిగానే కొట్టడంతో ఈ చిత్రం ఏకంగా 1100 కోట్లకి పైగా ప్రపంచ వ్యాప్త వసూళ్లు అందుకుంది.

ఐతే ఈ తరహా భారీ చిత్రాలకి కాస్టింగ్ పరంగా కొందరు విషయంలో వారే మొదటి ఛాయిస్ గా కనిపించరు. ముందు ఓ నటుడు లేదా నటి అనుకొని మరో నటీనటుల వద్దకి వెళ్లిన పాత్రలు ఉంటాయి. ఇలాంటివి పాన్ ఇండియా సినిమాల్లో చాలానే కనిపిస్తాయి. కాగా అలానే కల్కి లో ఓ స్టార్ నటి ఒక ఇంట్రెస్టింగ్ పాత్రని ఒప్పుకోలేదని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఆమె ఎవరో కూడా కాదు ఈ బుజ్జి రోబోట్ కి తన వాయిస్ ని ఇచ్చిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ అట. అయితే నిజానికి కీర్తి సురేష్ కి నాగ్ అశ్విన్ మరో ముఖ్య పాత్రని డిజైన్ చేసి అప్రోచ్ అయ్యాడట. కానీ ఆమె ఆ రోల్ ని ఒప్పుకోకుండా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. మరి ఆ రోల్ కాకపోయినా సినిమాతో తన ప్రెజెన్స్ ఉండాలని ఆ ఏఐ రోబోట్ బుజ్జికి డబ్బింగ్ చెప్పించడం జరిగిందట.

ఇలా కీర్తి సురేష్ ఈ భారీ సినిమాలో రోల్ వదులుకొని కేవలం వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో మన తెలుగు నుంచి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు నటించారు. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ రిలీజ్ చేసారు.
అలాగే ఈ చిత్రం తోనే నాగ్ అశ్విన్ టాలీవుడ్ నుంచి ఒక క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ ని ఓపెన్ చేయగా ఇందులో నుంచి మరిన్ని భారీ చిత్రాలు ముందు సంవత్సరాలలో హాలీవుడ్ అవెంజర్స్ తరహాలో మున్ముందు రానున్నాయి. ప్రస్తుతానికి కల్కి పార్ట్ 2 కి సన్నాహాలు చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల గ్యాప్ తర్వాత మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











