నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చినా.. 6 నెలలు అవ‌కాశాలు రాలేవు..

Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కీర్తి బాలనటిగా కెరీర్ ప్రారంభించి, 2013లో 'గీతాంజలి' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 'నేను శైలజ'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చింది 'మహానటి' సావిత్రి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. తరువాత 'మరిణ్తి', 'పెంగ్విన్', 'దసరా', 'సర్కారు వారి పాట' వంటి విభిన్న సినిమాలలో నటించి సత్తా చాటారు. ఇటీవల 'బేబీ జాన్' తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలాంటి నటి ఓ సినిమా వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.. ఆరు నెలలు కొత్త సినిమా అవకాశాలు రాలేదంట. ఇంతకీ ఆసినిమా ఏంటీ? అసలేం జరిగిందంటే?

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకున్న నటి కీర్తి సురేష్. ఇటీవల ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడారు. 'మహానటి' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆమెకి, ఆ మూవీ తర్వాత జరిగిన పరిణామాలు చాలా మందికి తెలియని విషయం. నటిగా గొప్ప గుర్తింపు తెచ్చిన పాత్రే తనకి కొంతకాలం ఇండస్ట్రీకి దూరం చేసిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Keerthy Suresh Reveals Shocking Phase After Mahanati Six Months Without Film Offers

నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'. మూవీలో కీర్తి సురేష్ లీడ్ రోల్ నటించిన విషయం తెలిసిందే. తన నటనకు ప్రేక్షకులను, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఆమె సావిత్రి పాత్రలో జీవించింది. ఆమె నటన తీరు చూసి సినీ ప్రపంచం ప్రశంసలతో ముంచెత్తింది. అప్పట్లో ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. కానీ ఈ విజయానంతరం ఆమె ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెబుతోంది. "మహానటి తర్వాత దాదాపు ఆరు నెలల పాటు నాకు ఒక్క సినిమా కూడా రాలేదు" అని కీర్తి చెప్పింది. స్క్రిప్ట్‌లు చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తన కెరీర్‌లో ఆరు నెలల గ్యాప్ వచ్చిందని పేర్కొంది.

ఈ సమయంలో కొత్త విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది. మహానటి తరహా భారీ పాత్ర తర్వాత దర్శకులు, నిర్మాతలు తన కోసం ప్రత్యేకమైన పాత్రలనే ఆలోచిస్తున్నారని భావించానని ఆమె చెప్పింది. అందుకే కొత్త ఆఫర్ల కోసం అతి పడకుండా, ఆ సమయాన్ని తన మేకోవర్, స్కిల్స్ డెవలప్‌మెంట్ కోసం వినియోగించుకున్నట్టు తెలిపింది. అవకాశాలు వెంటనే రాకపోయినా, తాను చేసిన పాత్రపై ఎప్పటికీ గర్వంగా ఉండే భావన కలిగినట్లు వివరించింది. "సావిత్రిగా నటించానని ఎప్పుడూ పశ్చాత్తాపం లేదు" అని ఆమె తెలిపింది.

కీర్తి మాట్లాడుతూ, 'మహానటి' విడుదల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌ను కూడా ప్రస్తావించింది. తన రూపం, మాట తీరుపై వచ్చిన విమర్శలు తాత్కాలికమని, నటనే నిజమైన సమాధానం అని చెప్పింది. ఆ మూవీ విడుదలైన తర్వాత వచ్చిన ప్రేక్షకుల ప్రేమ, అవార్డులు, ప్రశంసలు అన్నీ ఆమెకి తగిన గుర్తింపుగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులు తన నటనను అంగీకరించిన తర్వాతే ఇండస్ట్రీ మళ్లీ తనను చూడటం ప్రారంభించిందని అభిప్రాయపడింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్‌లో కొత్త దశలో అడుగుపెడుతోంది. ఆమె నటించిన 'రివాల్వర్ రీటా' మూవీలో లేడీ డాన్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా పూర్తిగా యాక్షన్, మాస్ అటిట్యూడ్‌తో కొనసాగుతోంది. ఇది ఆమెకు కొత్త ఇమేజ్‌ను క్రియేట్ చేసే అవకాశముంది. ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్‌లీ ముఖ్య పాత్రల్లో నటించగా, ఈ నెల 28న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఇదే కాకుండా కీర్తి వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది. విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్ధన', నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 'అక్క', మలయాళంలో 'తొట్టం', కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ థ్రిల్లర్ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించనుంది. ఈ విధంగా వివిధ భాషలలో, వేర్వేరు జానర్స్‌లో పాత్రలు ఎంచుకుంటూ తన కెరీర్‌కు కొత్త దారికి మళ్లిస్తుంది. మొత్తానికి, 'మహానటి' కీర్తి సురేష్‌ను స్టార్ నటిగా మార్చినా.. ఆ సినిమా వల్ల ఆరు నెలల ఖాళీ గా ఉండాల్సి వచ్చిందట.

More from Filmibeat

Read more about: mahanati keerthy suresh tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X