రాజమౌళి సినిమాలో క్రేజీ బ్యూటీ.. రాంచరణ్ కోసమేనా!
రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రాన్ని మించే 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి ఈ క్రేజీ మల్టీస్టారర్ ని తెరకెక్కించబోతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటించబోతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా డివివి దానయ్య నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు ఇంతవరకు బయటకు రాలేదు. హీరోయిన్ల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒక హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ ఎంపికైనట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాజమౌళి రాంచరణ్ కు జోడిగా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











