For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dasara యూనిట్ కు కీర్తి సురేష్ స్పెషల్ గిఫ్ట్.. 130 మందికి బంగారు కానుకలు! ఖర్చు ఎంతంటే?

  |

  మహానటి సినిమాతో సూపర్ పాపులర్ అయింది బ్యూటిఫుల్ కేరళ కుట్టి కీర్తి సురేష్. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం వరుసపెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు మహిళా ప్రాధాన్యత చిత్రాలతో సందడి చేసింది. అయితే ఆ సినిమాలు ఏవి అంతగా హిట్ కాకున్న కీర్తి సురేష్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవల సర్కారు పాట సినిమాతో గ్లామర్ ఒలకబోసిన కీర్తి సురేష్ దసరా, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా దసరా సినిమా యూనిట్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది బ్యూటిఫుల్ స్మైలీ కీర్తి సురేష్.

   గీతాంజలి సినిమా ద్వారా..

  గీతాంజలి సినిమా ద్వారా..

  మహానటి కీర్తి సురేష్ మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రొడ్యూసర్ సురేష్ కుమార్, నటి మేనక కుమార్తెగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ఈ కేరళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. 2000 సంవత్సరంలో బాల నటిగా పరిచయం అయింది కీర్తి సురేష్. అలా చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో అనేక చిత్రాలతో అలరించింది కేరళ కుట్టి. తర్వాత 2013లో విడుదైలన మలయాళ సినిమా గీతాంజలి ద్వారా మొదటగా హీరోయిన్ గా పరిచయం అయింది.

  వరుస సినిమాలతో..

  వరుస సినిమాలతో..

  తమిళం, తెలుగు సినీ ఆఫర్లు రావడంతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన 'నేను శైలజ' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు కీర్తి సురేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది కేరళ కుట్టి కీర్తి సురేష్. అలాగే, పెద్ద హీరోలతో భారీ చిత్రాల్లోనూ నటించింది.

  వివిధ భాషల్లో బిజీగా..

  వివిధ భాషల్లో బిజీగా..

  కెరీర్ ప్రారంభంలో అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

  బహుమతిగా బంగారు కానుకలు..

  బహుమతిగా బంగారు కానుకలు..

  ఇటీవలే మహేశ్ బాబుతో జోడీ కట్టిన కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం రివాల్వర్ రీటా, దసరా, భోళా శంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేష్. అయితే తాజాగా దసరా చిత్ర బృందానికి సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చి ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ కు బంగారు కానుకలు ఇచ్చింది కీర్తి సురేష్.

  అన్ని లక్షల గోల్డ్ కాయిన్స్..

  అన్ని లక్షల గోల్డ్ కాయిన్స్..

  దసరా సినిమాకు పని చేసిన 130 మందికి షూటింగ్ చివరి రోజున ఒక్కొక్కరికి 2 గ్రాములు బంగారు నాణేలను బహుమతిగా అందించింది బ్యూటిఫుల్ కీర్తి సురేష్. ఈ గోల్డ్ కాయిన్స్ కోసం కీర్తి సురేష్ సుమారు రూ. 13 లక్షలు ఖర్చు చేసిందని సమాచారం. గోల్డ్ కాయిన్స్ తీసుకున్న దసరా చిత్ర బృందం సభ్యులు సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

   90వ కాలం నాటి కథతో..

  90వ కాలం నాటి కథతో..

  ఇక దసరా సినిమా విషయానికొస్తే.. నాని హీరోగా చేస్తున్న ఈ మూవీ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రానుంది. 90వ కాలం నాటి కథతో రూపొందిన ఈ చిత్రంలో నాని గతంలో కనిపించని లుక్ లో అట్రాక్ట్ చేశాడు. ఇప్పటికే నానికి సంబంధించిన రఫ్ లుక్ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అలాగే డీ గ్లామర్ లుక్ లో కీర్తి సురేష్ కూడా ఆకట్టుకోనుంది.

  మార్చి 30న విడుదల..

  శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న దసరా సినిమాలో ప్రకాష్ రాజ్, సముద్ర ఖని, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మీరా జాస్మిన్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల ప్రకటించారు.

  English summary
  Tollywood Star Heroine Keerthy Suresh Gives Surprise Gifts To 130 Nani Starrer Dasara Movie Team Members With 2 gms Gold Coins And Pics Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X